ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ (సీబీసీఎస్), బీసీఏ (నాన్ సీబీసీఎస్) చివరి సెమిస్టర్, పీజీ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, పీజీ డిప్లొమా ఇన్ జర్మన్, బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ అన్ని సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in నందు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.