ఆన్లైన్లో ఓటరు నమోదుకు లైన్‌క్లియర్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు ఆన్లైన్ ప్రక్రియ మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు మొరాయించిన https:// ceotelan gana.nic.in సైట్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరిగి పనిచేస్తున్నది.
- పనిచేస్తున్న తెలంగాణ సీఈవో వెబ్సైట్
- ఓటరు నమోదుకు గడువు పెంపు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు ఆన్లైన్ ప్రక్రియ మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు మొరాయించిన https:// ceotelan gana.nic.in సైట్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరిగి పనిచేస్తున్నది. అర్హత కలిగిన పట్టభద్రుల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను (ఫారం-18) ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తున్నట్టు సీఈవో కార్యాలయం తెలిపింది.
తొలి విడతలో ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరించడానికి ఈ నెల 6 చివరి తేదీ అని ప్రకటించింది. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని, అదే రోజు నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ తీసుకుంటామని, ఆ సమయంలో కూడా ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్టు తెలిపింది.
ఆఖరి తేదీ వరకు నిరంతర సవరణ
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 22, 23 నిబంధనల మేరకు పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా నిరంతర సవరణకు అందుబాటులో ఉంటుంది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ (30.12.2026) ముగిసిన తర్వాత కూడా సదరు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

