One Nation-One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
One Nation, One Election: జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం రెఢీ అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ .. జమిలి ఎన్నికల నిర్వహణపై రిపోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల(One Nation, One Election) నిర్వహణకు లైన్ క్లియర్ అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ కమిటీ అందజేసిన రిపోర్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే.
రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్లో ఆ ప్యానెల్ ఏర్పాటైంది. లోక్సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. న్యాయశాఖ ఆ రిపోర్టును ఇవాళ కేంద్ర క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టింది. వంద రోజుల మోదీ సర్కార్ పాలన సందర్భంగా ఈ రిపోర్టును ముందుకు తీసుకువచ్చారు.
లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను చూసేందుకు ఇంప్లిమెంటేషన్ గ్రూపును ఏర్పాటు చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇక మున్సిపాల్టీలు, పంచాయితీ ఎన్నికలకే రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్వహిస్తుందని రిపోర్టులో తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

