అబుధాబి: సెమీఫైనల్ పోరులో 167 పరుగుల ఛేజింగ్లో న్యూజిల్యాండ్ బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. ఆరంభంలోనే ఓపెనర్ గప్తిల్ (4), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును మరో ఓపెనర్ డారియల్ మిచెల్ (12 నాటౌట్), వికెట్ కీపర్ డెవాన్ కాన్వే (14 నాటౌట్) ఆదుకున్నారు.
మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడిన వీరిద్దరూ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరుబోర్డును నడిపించారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి కివీస్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.