హైదరాబాద్, మే 30 (నమస్తే తె లంగాణ): తెలంగాణ రియల్ ఎస్టేట్ ని యంత్రణ మండలి (టీజీ రెరా) పూర్తిస్థాయి చైర్మన్ పోస్టు భర్తీకి రాష్ట్ర ప్రభు త్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గత చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ(రిటైర్డ్ ఐఏఎస్) అనారోగ్య కారణాలతో ఇటీవల రాజీనామా చేశారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్కు రెరా ఇన్చార్జి చైర్మన్ బా ధ్యతలు అప్పగించారు. పోస్టుకు అర్హ త, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 8లోగా దరఖా స్తు చేసుకోవాలి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(స్పెషల్ చీఫ్ సెక్రటరీ) కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అడిషనల్ సెక్రటరీ, సమానమైన హోదాలో పనిచేసినవారు అర్హులు. అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, రియల్ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనమిక్స్, ప్లానింగ్, లా, కామర్స్, అకౌంటెన్సీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో కనీసం 20 ఏండ్ల సుదీర్ఘ అనుభవం కలిగి ఉం డాలి. ఎంపికైతే నెలకు రూ.1.50 లక్షల వేతనం, ఇంటిఅద్దె భత్యం కింద రూ. 50 వేలు, అధికారిక వాహన సదుపాయం కల్పిస్తారు.