e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News విజ్ఞాన్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్

విజ్ఞాన్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్

విజ్ఞాన్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్
విశాట్‌-2021 దరఖాస్తుకు మే 20వ తేదీ వరకు గడువు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీహెచ్‌డీలో ప్రవేశాలకు విజ్ఞాన్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ (www.vignan.ac.in) ద్వారా మే 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు. మే 24 నుంచి 30 వరకు తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. వీశాట్‌ తొలి 100లోపు ర్యాంకులు సాధించినవారికి 75 శాతం, 101-200లోపు ర్యాంకుల వారికి 50 శాతం, 201-400లోపు ర్యాంకుల వారికి 25 శాతం, 4001 నుంచి 2000 లోపు ర్యాంకులు సాధించినవారికి 10 శాతం ఫీజు రాయితీ ఇస్తామని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు గతేడాది రూ.4 కోట్లకుపైగా విలువైన ఫీజు రాయితీ ఇచ్చినట్టు ఆయన గుర్తుచేశారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, డీఎన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ వీ రవికుమార్‌, డీన్‌ ఐటీ అండ్‌ లైబ్రరీ సర్వీసెస్‌ డాక్టర్‌ కేవీ కృష్ణకిశోర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఏ గౌరీశంకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విజ్ఞాన్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్

ట్రెండింగ్‌

Advertisement