Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
Notices | సీఎంఆర్ ధాన్యం బకాయిలు చెల్లించాలని మహబూబ్ నగర్ జిల్లా అధికారులు రైస్ మిల్కు నోటీసులు అంటించారు.
మాగనూరు : సీఎంఆర్ ధాన్యం బకాయిలు చెల్లించాలని మహబూబ్ నగర్ జిల్లా అధికారులు రైస్ మిల్ కు నోటీసులు ( Notices ) అంటించారు. మాగనూరు మండలం వడ్వట్ గ్రామంలోని శంకర్ లింగేశ్వర రైస్ మిల్ ( Shanker Lingeshwara Ricemill ) యజమాని దండే తమన్నా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.7,85,30,829 బకాయిలను వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.
శుక్రవారం నోటీసులు అందజేయడానికి అధికారులు మిల్లుకు వెళ్లగా యజమాని అందుబాటులో లేకపోవడంతో సివిల్ సప్లై డీఎం, డిప్యూటీ తమసీల్దార్లు సైదులు , నాగరాజు ,కాళప్ప తదితరులు నోటీసులు మిల్లుకు అతికించారు. గతంలో ఈ రైస్ మిల్లుకు ప్రభుత్వ ధాన్యం కేటాయింపుల వ్యవహారంలో భారీ మొత్తంలో బకాయిలు ఉన్నట్లు గుర్తించారు.
2024లో కేటాయించిన ధాన్యం, 2025 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కలిపి మొత్తం 80,972 బస్తాల ధాన్యం నిల్వలు, లెక్కల పరిశీలనలో ప్రభుత్వానికి రూ.7.85 కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. బకాయిల లెక్కలపై ఏమైనా సందేహాలు ఉంటే సివిల్ సప్లై కార్యాలయంలో రీకన్సిలేషన్ చేసుకునేందుకు నుంచి ఏడు రోజుల గడువు కల్పించారు. బకాయిలు చెల్లించకుంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఎందుకు వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

