బాలీవుడ్ కథానాయిక నోరా ఫతేహీ పేరు వినగానే ప్రత్యేక గీతాలు గుర్తుకొస్తాయి. ‘బాహుబలి’ ‘కిక్-2’ ‘లోఫర్’ చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో అదరగొట్టిందీ భామ. బాలీవుడ్లో కూడా ఈ అమ్మడు ఎక్కువగా ప్రత్యేక గీతాల్లోనే నర్తించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సుందరి తెలుగులో ఓ భారీ అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నోరా ఫతేహీ కీలక పాత్రలో నటించనుందట. ప్రత్యేకగీతంతో పాటు కొన్ని ముఖ్య సన్నివేశాల్లో ఆమె భాగం కానుందని సమాచారం. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. ‘హరిహరవీరమల్లు’ చిత్రాన్ని నిర్మాత ఏ.ఏం. రత్నం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. . ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పవకల్యాణ్ పాల్గొనగా పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.