నేటితో సాగర్‌లో ముగియనున్న నామినేషన్ల పర్వం

హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్‌కుమార్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు చేసేందుకు నేడు చివరి అవకాశమని అధికారులు తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలించనుండగా.. ఏప్రిల్ మూడో తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు పేర్కొన్నారు.
మంత్రులతో కలిసి నామినేషన్ వేయనున్న భగత్‌కుమార్
నాగార్జునసాగర్ శాసనసభ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్ నిడమనూరు తాసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నామని, సభలు, ర్యాలీలు ఉండబోవని అన్నారు. పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులెవరూ రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

