యెడియూరప్ప సేవలు మరువలేనివి: ప్రధాని మోదీ
PM Modi: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ జనతాపార్టీ ఎదుగుదలకు, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి యెడియూరప్ప

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ జనతాపార్టీ ఎదుగుదలకు, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి యెడియూరప్ప చేసిన విశేష సేవలు ఎప్పటికీ మరువలేనివని ఆయన కొనియాడారు. గత కొన్ని దశాబ్దాలుగా యెడియూరప్ప కర్ణాటక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, రాష్ట్రం మూలమూలలా తిరిగి ప్రజలతో మమేకమై అన్ని ప్రాంతాల అభివృద్ధికి కఠోర శ్రమ చేశారని ప్రశంసించారు. సామాజిక సంక్షేమం విషయంలో యెడియూరప్పకు ఉన్న కమిట్మెంట్ను ప్రశంసించకుండా ఉండలేమని ప్రధాని వ్యాఖ్యానించారు.
కొత్త ముఖ్యమంత్రి బసవరాజుకు అభినందనలు: ప్రధాని
అదేవిధంగా కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బసవరాజు బొమ్మైకి ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. చట్టసభలకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి బసవరాజు బొమ్మైకి అపార అనుభవం ఉన్నదని, ఆ అనుభవం కర్ణాటక భవిష్యత్ పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ సర్కారు ద్వారా కర్ణాటకలో జరిగిన అసాధారణ అభివృద్ధిని బసవరాజు బొమ్మై మరింత ఇనుమడింపజేస్తారన్న నమ్మకం తనకు ఉన్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

