46. ఇక్ష్వాకుల కాలంలో శిల్పాల్లో అతి ముఖ్యమైంది?
1) అమరావతి 2) మాంధాత శిల్పం
3) మధుర శిల్పం 4) రోమన్ శిల్పం
47. చుళధమ్మగిరి కొండపై బౌద్ధ విహారం, చైత్యాన్ని నిర్మించింది?
1) మఠరశ్రీ 2) ఉపాసిక బోధిశ్రీ
3) అటవి శాంతిశ్రీ 4) హర్మ్యశ్రీ
48. నాగార్జునకొండలో బయటపడిన కట్టడాలు?
1) చైత్యాలు 2) పూర్ణకుండం
3) రాజప్రాసాదం 4) స్టేడియం
49. కింది వాటిని జతపర్చండి?
1. ఉత్తర భారతేదశం ఎ. కాల్డెల్
2. కన్నడ ప్రాంతం బి. ఏగెల్
3. తమిళనాడు సి. గోపాలచారి
4. కృష్ణాతీరం డి. రాప్సన్, బూలర్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
50. కింది వాటిలో సరైనది?
ఎ. దేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం- శ్రీపర్వత విశ్వవిద్యాలయం
బి. దేశంలో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం- తక్షశిల
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
51. కింది వాటిలో ఉపాసిక బోధిశ్రీ గురించి సరికానిది?
1) చుళధమ్మగిరిపై బౌద్ధ విహారం, చైత్యం నిర్మించింది
2) పావిల వద్ద విహారాలను నిర్మించింది
3) పుష్పగిరి వద్ద శిలామండపం నిర్మించింది
4) శ్రీపర్వతం విహారానికి మరమ్మతులు చేయించింది.
52. ఇక్ష్వాక రాజుల వరుస క్రమాన్ని గుర్తించండి?
ఎ. శాంతమూలుడు
బి. రుద్రపురుషదత్తుడు
సి. వీరపురుష దత్తుడు
డి. ఎహూవల శాంతమూలుడు
1) ఎ, బి, సి, డి 2) డి, సి, బి, ఎ
3) ఎ, సి, బి, డి 4) ఎ, సి, డి, బి
53. కింది వాటిలో సరైనది?
ఎ. ఇక్ష్వాకుల కాలంలో గ్రామాధికారిని ‘తలవర’ అంటారు
బి. వీరి కాలంలో గ్రామపాలనాధికారం వంశపారపర్యంగా జరిగేది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
54. కింది వాటిలో సరికానిది?
1) ఇక్ష్వాకుల కాలంలో చేతివృత్తులు, పట్టణాలు పతనమయ్యాయి
2) వాణిజ్యం ఎక్కువగా భూ మార్గాల ద్వారా జరిగింది
3) రోమన్ నాణేలు నేలకొండపల్లి వద్ద దొరికాయి
4) గ్రామాల్లో చేతిపరిశ్రమలు కొనసాగుతు న్నట్లు విళపట్టి శాసనం సూచిస్తుంది
55. కింది వాటిలో సరైనది?
ఎ. వీరపురుష దత్తుడు బౌద్ధమతాన్ని
అనుసరించాడు
బి. సిద్ధ నాగార్జునుడు మహాయాన
బౌద్ధమతాన్ని అనుసరించాడు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
56. కింది వాటిలో సరికాని జత?
1. దిజ్ఞాగుడు- ప్రమాణ సముచ్ఛయం
2. ఆర్యదేవుడు- అక్షర శతక
3. భావవివేకుడు- ప్రజ్ఞాలంకార శాస్త్రం
4. నాగార్జునకొండ- బౌద్ధమత కేంద్రం
57. కింది వాటిలో సరైనది?
ఎ. ఇక్ష్వాకుల కాలంలో ఆకుపచ్చని రాతిపై శిల్పాలు చెక్కారు
బి. అమరావతి శిల్పాల్లో మొదటిసారిగా సతీసహగమనం కనిపించింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
58. కింది వాటిని జతపర్చండి?
1. బుద్ధఘోషుడు ఎ. విసుద్ధమగ్గ
2. భావవివేకుడు బి. న్యాయబిందు
3. దిజ్ఞాగుడు సి. తర్కజ్వాల
4. ధర్మకీర్తి డి. ప్రమాణ సముచ్ఛయం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
59. కింది వాటిని జతపర్చండి?
1. మహాతలవర ఎ. శాంతిభద్రతలు
2. మహాదండనాయక
బి. శిక్షలు విధించేవాడు
3. కోష్టాగారిక సి. కోశాధికారి
4. ప్రాఢ్వివాక్కుడు
డి. ప్రధాన న్యాయమూర్తి
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
60. ఇక్ష్వాకుల కాలంలో స్త్రీ అంతస్తుకు సంబంధించి సరైనది?
ఎ. శాతవాహనులు లాగా, ఇక్ష్వాక రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరును
చేర్చుకున్నారు
బి. స్త్రీకి ఆస్తి హక్కు ఉండేది కాదు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
61. కింది వాటిని జతపర్చండి?
1. తులాదివ్య ఎ. నేరస్థుడి కాళ్లు కాలకుండా నిప్పులపై నడవాలి
2. తుండుల దివ్య బి. మరుగుతున్న నూనెలోంచి నాణేన్ని తీయాలి
3. తప్తమస్క దివ్య సి. మంత్రించిన బియ్యాన్ని నమలాలి
4. అగ్ని దివ్య డి. తూకం వేసి నేరస్థుడిని నిర్ధారణ చేయడం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
62. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) ఇక్ష్వాకులు భూమిశిస్తును ‘భాగ’ అనేవారు
2) వీరి కాలంలో భూమిశిస్తు 1/6వ వంతు ఉండేది
3) ధన రూపంలోని పన్నును హిరణ్య
అనేవారు
4) రాజ్య ఆదాయాన్ని 5 భాగాలుగా
ఖర్చుచేసేవారు
63. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి?
1) వీరి అధికార మతం శైవమతం
2) వీరు ఆదరించిన మతం బౌద్ధ మతం
3) వీరి కాలంలో సతీసహగమనం అమల్లో ఉండేది
4) నాగార్జునకొండ వద్ద క్రీడావేదిక లభించింది
64. నాగార్జున కొండకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఇక్కడ బుద్ధుడి ధాతుగర్భ స్థూపం ఉంది
2) ఇది శాతవాహనుల రెండో రాజధాని
3) ఇక్కడ సింహళ విహారం బయటపడింది
4) ఇది ఇక్ష్వాకుల రాజధాని విష్ణుకుండినులు
65. విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు?
1) మొదటి మాధవ వర్మ
2) రెండో మాధవ వర్మ
3) మూడో మాధవ వర్మ 4) మంచెన
66. త్రికూట మలయాధిపతి అనే బిరుదు గల రాజు?
1) మొదటి మాధవ వర్మ
2) రెండో మాధవ వర్మ
3) మూడో మాధవ వర్మ 4) మంచెన
67. తుండి, చిక్కుళ్ల, పెద్దతుమ్ములగూడెం శాసనాలను వేయించిన రాజు?
1) గోవింద వర్మ 2) విక్రమేంద్ర వర్మ
3) మొదటి మాధవ వర్మ
4) రెండో మాధవ వర్మ
68. విష్ణుకుండినుల నాణేలపై గల చిహ్నం?
1) నంది 2) వరాహం
3) సూర్యుడు 4) ఏనుగు
69. కింది వాటిలో సరికాని వాక్యం?
1) విష్ణుకుండినుల రాజధాని వినుకొండ
2) వీరి అధికార భాష సంస్కృతం
3) వీరి అధికార మతం వైదికం
4) వీరి రాజ లాంఛనం వరాహం
70. గణపతిని పూజించడం ఎవరి కాలం నుంచి ప్రారంభమయ్యింది?
1) విష్ణుకుండినులు 2) ఇక్ష్వాకులు
3) శాతవాహనులు 4) పల్లవులు
71. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) గోవింద వర్మ ఈపూరు శాసనాన్ని
వేయించాడు
2) ఇంద్రవర్మ రామతీర్థ శాసనాన్ని
వేయించాడు
3) హిందూ గుహలను మొదట నిర్మించినవారు విష్ణుకుండినులు
4) బొజ్జనకొండ బౌద్ధక్షేత్రం
72. కీసరగుట్టను రాజధానిగా చేసుకొని అక్కడ శైవక్షేత్రాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాజు?
1) గోవింద వర్మ
2) మొదటి మాధవ వర్మ
3) రెండో మాధవ వర్మ
4) మూడో మాధవ వర్మ
73. కింది వాటిలో అసత్య వాక్యం?
1) మొదటి మాధవ వర్మ వాకాటక రాజులతో వైవాహిక సంబంధాలు ఏర్పర్చుకొన్నాడు
2) కందర రాజులు త్రికూటమలయ అనే బిరుదు పొందాడు
3) విష్ణుకుండినుల కులదైవం శ్రీపర్వతస్వామి
4) విష్ణుకుండినులందరిలో గొప్పవాడు రెండో మాధవ వర్మ
74. ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురం గుహలను నిర్మించిన రాజు?
1) మొదటి మాధవ వర్మ
2) రెండో మాధవ వర్మ
3) మూడో మాధవ వర్మ 4) గోవింద వర్మ
75. రెండో మాధవ వర్మకు సంబంధించి సరికాని వాక్యం?
1) ఇతడు 12 అశ్వమేధ యాగాలను చేశాడు
2) ఇతడు ఒక రాజసూయ యాగాన్ని చేశాడు
3) ఇతడి బిరుదు త్రికూటమలయాధిపతి
4) ఇతడు వినుకొండ నుంచి దెద్దలూరుకు రాజధానిని మార్చాడు
76. పద్మాసనంలో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహంగా మార్చిన రాజు?
1) మొదటి మాధవ వర్మ
2) రెండో మాధవ వర్మ
3) మూడో మాధవ వర్మ 4) ఇంద్రవర్మ
77. మూడో మాధవ వర్మకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) విష్ణుకుండినుల్లో ఎక్కువ కాలం పాలించిన రాజు
2) ఇతడు న్యాయానికి ప్రతీకగా పేరుగాంచాడు
3) ఇతడు ప్రబోధ చంద్రోదయం అనే గ్రంథాన్ని రచించాడు
4) ఇతడి బిరుదు జనాశ్రయ
78. విష్ణుకుండినుల రాజ్యవ్యవస్థకు సంబంధించి సరికానిది?
1) న్యాయపాలనకు పెట్టింది పేరు
2) మహారాజు అనే బిరుదును పొందాడు
3) జనాశ్రయ, ఉత్తమాశ్రయ, సత్యాశ్రయ, విక్రమాశ్రయ అనే బిరుదులను పొందాడు
4) రాష్ర్టానికి పాలకుడు రాజు
79. విష్ణుకుండినుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యం?
1) గ్రామాలు స్వయం సంవృద్ధి చెందాయి
2) వృత్తుల ప్రజలు ఒకరిపై ఒకరు
ఆధారపడేవారుకాదు
3) భూమిని వివర్తనాలతో కొలిచారు
4) విదేశీ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశారు
80. విష్ణుకుండినుల మతానికి సంబంధించి సరికాని వాక్యం?
1) వీరు వైదిక ధర్మాన్ని పాటించారు
2) శివారాధన ప్రముఖంగా కనిపించేది
3) మొదటి గోవింద వర్మ జైనమతాన్ని పోషించాడు
4) రాజులు అనేకమంది అశ్వమేధ యాగాలు చేశారు
81. విష్ణుకుండినుల కాలంలో ముఖ్య కేంద్రాలు (విద్యాకేంద్రాలు)?
1) అమరావతి, వేంగి
2) అమరావతి, విజయపురి
3) అమరావతి, గుంటూరు
4) అమరావతి, కర్నూలు
82. మొగల్రాజపురం గుహలకు సంబంధించి సరికాని వాక్య?
1) వీటిని మొదటి మాధవ వర్మ నిర్మించాడు
2) మొగల్రాజపురంలో మొత్తం 8 గుహలు ఉన్నాయి
3) మొగల్రాజపురంలో 3 గుహలు
సాధారణమైనవి
4) నాలుగో గుహ దుర్గాదేవి గుహ,
5వ గుహ శివతాండవ గుహ
83. మొగల్రాజపురంలో అర్ధనారీశ్వర ప్రతిమ ఎన్నో గుహలో ఉంది?
1) 1వ 2) 2వ 3) 3వ 4) 4వ
84. ఒంగోడు శాసనాన్ని వేయించిన రాజు?
1) సింహవర్మ
2) విజయస్కంద వర్మ
3) రెండో సింహ వర్మ
4) విష్ణుగోవుడు
పల్లవులు
85. పల్లవులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) పల్లవ సామ్రాజ్య స్థాపకుడు
వీరకూర్చవర్మ
2) పల్లవుల రాజధాని కాంచీపురం
3) పల్లవుల్లో గొప్పవాడు మొదటి
నరసింహ వర్మ
4) పల్లవుల ప్రముఖ విద్యాకేంద్రం
విజయపురి