December 31 restrictions | డిసెంబర్ 31.. న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు
December 31 restrictions | నూతన సంవత్సర వేడుకలకు అనుమతించిన ప్రభుత్వం.. వినోద కార్యక్రమాలపై కఠిన ఆంక్షలు విధించింది. నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే

తాత్కాలిక లైసెన్స్ తప్పనిసరి
2 డోస్‌ల వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతించాలి
అశ్లీలత, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినం
పరిమితి మించి శబ్దాలు మోగిస్తే కేసులు
వేడుకల వద్ద నిబంధనల డిస్ ప్లే
మైనర్లకు వాహనాలిస్తే పెద్దలకు జైలు
అన్ని ప్రాంతాల్లో షీ టీమ్స్ నిఘా
మూడు పోలీసు కమిషనరేట్ల సీపీల వెల్లడి
సిటీబ్యూరో, డిసెంబర్ 29: నూతన సంవత్సర వేడుకలకు అనుమతించిన ప్రభుత్వం.. వినోద కార్యక్రమాలపై కఠిన ఆంక్షలు విధించింది. నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే మూడు నక్షత్రాల హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌ల నిర్వాహకులు ట్రై పోలీస్ కమిషనర్ల నుంచి వినోదానికి సంబంధించి తాత్కాలిక లైసెన్స్ తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ప్రభుత్వం ఈనెల 25వ తేదీన జారీ చేసిన 327 జీవో ప్రకారం వేడుకలకు హాజరయ్యే వారు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా నిర్వాహకులు, చూడాలని పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలు..
- వేడుకల్లో పాల్గొనే వారు తప్పని సరిగా భౌతిక దూరం పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. మాస్కు లేని వారిని అనుమతించవద్దు.
- తప్పని సరిగా థర్మామీటర్స్, థర్మల్ స్కానర్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి.
- రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారి (ఎలక్ట్రానిక్, ఫిజికల్ ) సర్టిఫిట్ను పరిశీలించి అనుమతించాలి.
- కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, వేడుక ప్రాంగణం సామర్థ్యానికి మించి పాస్‌లు, లైసెన్స్, కూపన్లు జారీ చేయవద్దు.
- మాస్కు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో తిరిగే వారికి రూ. 1000 జరిమానా.
- ఒమిక్రాన్ దృష్ట్యా వేడుకల నిర్వహణతో పాటు వచ్చే వారికి తగిన సమాచారం ఇవ్వాలి. వేడుకలకు హాజరయ్యే వారు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలి. గుంపులుగా నిలబడే అవకాశం ఉన్న బార్లలో నిలబడే ప్రాంతం, టాయిలెట్స్, లిఫ్టులు, కారిడార్స్, నడిచే దారి, ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా యాజమాన్యం సరిపడా సిబ్బందిని నియమించుకోవాలి.
- వేడుకలకు సంబంధించిన ప్రాంగణంలో ఉన్న సిబ్బంది, నిర్వాహకులు 48 గంటల ముందు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలి. నెగెటెవ్ వచ్చిన వారు మాత్రమే ఉండాలి.
- వేడుకల్లో ఉన్న వారికి నిర్వాహకులు తప్పని సరిగా సర్జికల్ మాస్కులు అందించాలి.
- కొవిడ్ మహమ్మారి, విపత్తుల నిర్వహణ చట్టం -2005 నిబంధనలు ఎప్పుడైనా అమలు చేయవచ్చు.
శాంతి, భద్రతల సమస్యలకు తావు లేకుండా..
- బహిరంగ ప్రదేశాల్లో డీజేలకు అనుమతి లేదు.
- సంగీత కార్యక్రమాలు జరిగే చోట నిబంధనల మేరకు శబ్ధం రావాలి. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు నిబంధనల మేరకు 45 డిసెబుల్ శబ్ధం నిబంధనలు ఉల్లంఘించరాదు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటారు.
- ఈవెంట్లకు హాజరయ్యే గాయకులు రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దు. వారి నిర్ణీత ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండాలి.
- అశ్లీలతకు తావు లేకుండా చూసుకోవాలి.
- వేడుకలు జరిగే చోట డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదు.
- ప్రజా భద్రత దృష్ట్యా ఈవెంట్లు జరిగే చోట సీసీ కెమెరాల నిఘా తప్పని సరిగా ఉండాలి. ప్రవేశ మార్గం, బయటకు వేళ్లే దారులు, పార్కింగ్ స్థలాలను కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలు ఉండాలి.
- తాత్కాలిక లైసెన్స్ పొందిన వారు దానిని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి,
- ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిన సమయం వరకు మద్యం సరఫరా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు లిక్కర్ అనుమతించవద్దు. మైనర్లను జంటలుగా కూడా అనుమతించవద్దు.
- నిషేధాజ్ఞలు అందరికీ తెలిసే విధంగా గోడలపై రాసి ఉంచాలి.
- అగ్నిమాపక శాఖ ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు ఉండరాదు.
- బార్ అండ్ రెస్టారెంట్లలో లైవ్ బ్యాండ్స్‌కు అనుమతి లేదు. ఏదైనా నష్టం జరిగినా, ఆందోళన జరిగినా బాధ్యుడే బాధ్యత వహించాలి.
- పబ్, బార్ నిర్వాహకులు మద్యం మత్తులో ఉన్న వారిని ఇంటికి పంపించేందుకు డ్రైవర్స్, క్యాబ్ సౌకర్యం కల్పించాలి. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి ఉండకూడదు.
ట్రాఫిక్ నిబంధనలు – డిస్ ప్లే చేయాలి…
- డ్రంక్ అండ్ డ్రైవ్ మోటర్ వాహనాల చట్టం 185 ప్రకారం నేరం.
- కేసు నమోదైన వారితో మద్యం సేవించకుండా, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి వాహనం అప్పగిస్తారు. లేదంటే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు. మరుసటి రోజు స్టేషన్లో పత్రాలు చూపించి వాహనాన్ని తీసుకెళ్లాలి.
- డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, మరికొన్ని సందర్భాల్లో రెండు శిక్షలు కోర్టు వేయవచ్చు, మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం/ లేదంటే పూర్తిగా రద్దు చేయవచ్చు.
- మైనర్లు వాహనాలు నడుపొద్దు, వాహన యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- అన్ని ప్రాంతాల్లో షీ టీమ్స్ నిఘా ఉంటుంది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
- లైసెన్స్ పొందిన వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిస్తే ఇచ్చిన లైసెన్స్‌ను కమిషనర్ ఎప్పుడైనా రద్దు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

