Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో అత్యధికులు తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లోనే ఉన్నారు. బాధితుల్లో 90 శాతానికి పైగా టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు.
Diabetes | ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో అత్యధికులు తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లోనే ఉన్నారు. బాధితుల్లో 90 శాతానికి పైగా టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం ఈ వ్యాధికి ప్రధాన కారణం. ఇక టైప్-1 మధుమేహం శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేయడం వల్ల వస్తుంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య 130 కోట్లకు మించుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి వల్ల గుండె, మూత్రపిండాలు, కళ్ల సమస్యలతోపాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. అయితే కొత్త చికిత్సా విధానాలు, పరిశోధనలు భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్నాయి.
టైప్-1 మధుమేహానికి పూర్తి స్థాయి చికిత్స దిశగా..
టైప్-1 మధుమేహానికి పూర్తిస్థాయి చికిత్సను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రయోగశాలలో తయారు చేసిన లేదా దాతల నుంచి సేకరించిన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను బాధితుల శరీరంలోకి మార్పిడి చేసే విధానంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ చికిత్స పొందిన వారిలో చాలామందికి ఇన్సులిన్ అవసరం తగ్గడం లేదా పూర్తిగా నిలిచిపోవడం వంటి ఫలితాలు కనిపించాయి. అయితే మార్పిడి చేసిన కణాలను శరీరం బాహ్య కణాలుగా గుర్తించి వాటిపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. దీనిని అడ్డుకోవడానికి రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే మందులు ఉపయోగించాల్సి వస్తుంది. మరోవైపు, మార్పిడి చేసే కణాలను ముందుగానే మార్పులు చేసి రోగనిరోధక వ్యవస్థ దాడి చేయకుండా చూడడం, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని రక్షించే మందులను అభివృద్ధి చేయడం వంటి మార్గాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు.
అలాగే టైప్-1 మధుమేహం ప్రారంభ దశలో ఉన్నవారికి టెప్లిజుమాబ్ అనే ఔషధం వ్యాధి పురోగతిని ఆలస్యం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు నాశనం కావడాన్ని నెమ్మదింపజేసి, కొందరిలో ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరాన్ని మూడేళ్ల వరకు వాయిదా వేస్తుంది.
రక్తపరీక్షలతో వ్యాధి నిర్దారణ..
టైప్-1 మధుమేహాన్ని ముందుగానే గుర్తించేందుకు రక్త పరీక్షలు కూడా ఉపయోగపడుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నదా లేదా అనేది లక్షణాలు కనిపించకముందే గుర్తించవచ్చు. తద్వారా వ్యాధి ముదరకముందే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇక టైప్-2 మధుమేహం విషయంలోనూ ఆశాజనక ఫలితాలు వెలువడుతున్నాయి. అక్టోబర్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తక్కువ కేలరీల ఆహారం, పర్యవేక్షణలో వ్యాయామం చేసిన ప్రారంభ దశ టైప్-2 బాధితుల్లో సగానికి పైగా ఆరు నెలల్లో వ్యాధి ఉపశమన స్థితికి చేరినట్లు వెల్లడైంది.
వ్యక్తిగత ఆహారం, వ్యాయామం, నిద్రకు సంబంధించిన సూచనలు అందించే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ కూడా కొందరిలో దీర్ఘకాలికంగా మధుమేహ నియంత్రణకు తోడ్పడినట్లు మరో అధ్యయనం తెలిపింది. జీఎల్పీ-1 తరహా మందులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతోపాటు, అధిక ప్రమాదంలో ఉన్న బాధితుల్లో మరణాలు, ఆసుపత్రిలో చేరే పరిస్థితులు, అవయవాల తొలగింపు ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
సగం మందికి వ్యాధి ఉందని కూడా తెలియదు..
అయితే కొత్త చికిత్సలు అందుబాటులోకి రావడం మాత్రమే సరిపోదు. వాటిని అవసరమైన ప్రతి ఒక్కరికీ అందించడం కూడా అంతే ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా టైప్-2 మధుమేహం ఉన్న 25 కోట్ల మందికి పైగా తమకు ఈ వ్యాధి ఉందనే విషయం తెలియదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పరీక్షలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో సగం మందికి మాత్రమే అవసరమైన ఇన్సులిన్ అందుతోంది. జీఎల్పీ-1 మందులు ప్రధానంగా అధిక ఆదాయం కలిగిన దేశాల్లోనే అందుబాటులో ఉండగా, వాటి ధరలు కూడా చాలా మందికి భారంగా మారుతున్నాయి. తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో టైప్-1 మధుమేహ పరీక్షలు, ప్రారంభ చికిత్సలు కూడా విస్తృతంగా అందుబాటులో లేవు. ఒక సర్వేలో పాల్గొన్న వెయ్యి మందికి పైగా మధుమేహ బాధితుల్లో మూడో వంతు మందికిపైగా ఖర్చులు భరించలేక గతేడాది తమకు అవసరమైన వైద్య సరఫరాలను తగ్గించుకున్నట్లు వెల్లడైంది.
ఇన్సులిన్ తయారీ, పంపిణీని సులభతరం చేసే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. 1923లో ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన ఫ్రెడరిక్ బాంటింగ్ దాని పేటెంట్‌ను కేవలం ఒక కెనడియన్ డాలర్‌కు విక్రయించారు. ఇన్సులిన్ ప్రపంచంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్నదే ఆయన ఆశయం. ఆ లక్ష్యం నెరవేరాలంటే కొత్త చికిత్సల అభివృద్ధితోపాటు, వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

