పీఎస్‌యూలకు ముప్పుతప్పినట్టేనా?
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఈసారికి కాస్త వెనుకడుగు వేసే అవకాశాలున్నాయి. పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడం, మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పీఎస్‌యూల ప్రైవేటీకరణపై మోదీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.
- ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గనున్న ఎన్డీఏ సర్కారు
- రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ సంస్థలకు కొత్త ఆశలు
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఈసారికి కాస్త వెనుకడుగు వేసే అవకాశాలున్నాయి. పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడం, మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పీఎస్‌యూల ప్రైవేటీకరణపై మోదీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్కాక ప్రైవేటీకరణపై అత్యంత దూకుడుగా వ్యవహరించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా 35 పీఎస్‌యూలు ప్రైవేటుపరం అయ్యాయి. మారిన రాజకీయ పరిణామాలతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో సంకీర్ణ సర్కారు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నట్లు తెలుస్తున్నది. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు ప్రైవేటీకరణకు ఒప్పుకునే అవకాశాలు లేకపోవడంతో మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్లో ప్రైవేటీకరణకు మొగ్గుచూపకుండా..కేవలం వాటాని పునరుద్దరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి ఇటీవల పలువురు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు కూడా ఇందుకు బలంచేకూరుతున్నది. దీంట్లోభాగంగా రాష్ట్రంలో ఉన్న ఆరు ప్రభుత్వరంగ సంస్థలకు ఉపశమనం లభించే అవకాశాలున్నాయి.
మూతపడిన 10 సంస్థలు..
రాష్ట్రవ్యాప్తంగా పది ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయి. ఒకానొక దశలో 27 సంస్థలు ఇక్కడ కార్యకలాపాలను కొనసాగించగా, ఆర్థిక ఇబ్బందులు, నిధులు కేటాయింపులు లేకపోవడంతో పది సంస్థలు మూతపడ్డాయి. దీంతో వీటి సంఖ్య 17కి పరిమితమయ్యాయి. ఈ మూతపడిన పది సంస్థల్లో ఆరింటిని పూర్తిగా వదిలించుకోవాలని కేంద్ర సర్కార్ గతంలోనే ఎత్తుగడ వేసింది. కానీ కేసీఆర్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. అయితే నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఉన్న కంపెనీల భూములను విక్రయించాలంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలుపాల్సివుంటుంది. ఈ క్రమంలోనే ఆరు సీపీఎస్‌యూల ప్రైవేటీకరణకు ఆమోదం తెలుపాలని రాష్ట్ర సర్కార్‌పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది.
హెచ్ఎంటీ తెరుచుకునేనా..
ఒకప్పుడు దేశానికి సమయం చూపించిన హెచ్ఎంటీ ప్రస్తుత ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నది. పీఎస్‌యూలను పట్టించుకోకుండా ప్రైవేట్ రంగ సంస్థలనే ప్రోత్సహిస్తున్న కేంద్ర సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో ఎన్నో సంస్థలు మూతపడ్డాయి. వీటిలో దేశానికి సమయం చూపించిన హెచ్ఎంటీ కూడా ఉన్నది. ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించిన ఈ సంస్థ తయారు చేసిన గడియారాలే ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఆ తర్వాతి క్రమంలో ప్రైవేట్ రంగ సంస్థలనుంచి పోటీ పెరగడం, నిధులు కేటాయింపులు తగ్గిపోవడంతో ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇటీవల కాలంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి రాష్ట్ర పర్యటన సందర్భంగా హెచ్ఎంటీ ప్లాంట్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హెచ్ఎంటీని పునరుద్ధరించి తమ ఉద్యోగాలు కాపాడాలని, తమకు రావాల్సిన ప్రయోజనాలను అందించాలని కోరారు. దీనిపై కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. హెచ్ఎంటీ పునరుద్ధరించడంతోపాటు ఆక్రమణకు గురవుతున్న హెచ్ఎంటీ భూములను కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రైవేటీకరణకు ప్రతిపాదిత సీపీఎస్యులు, వాటి ఆధీనంలోని భూములు(ఎకరాల్లో)..
- హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్(హెసీఎల్) – 324.87
- హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్ – 126.32
- ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) – 551.03
- హెచ్ఎంటీ వాచెస్ – 888.05
- సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐ) – 2,272.85
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ – 3,020
మొత్తం – 7,183.12 ఎకరాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

