Pawan Kalyan | హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన పార్టీ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీసింది. ఈ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా జనసేన నాయకులతో కలిసి తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, “కనీసం ఈ ప్రెస్‌మీట్‌కైనా తెలంగాణ పోలీస్ శాఖ అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ వేసిన సెటైర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, దీనిపై నెటిజన్లు మాత్రం ఊహించని రీతిలో ఘాటుగా స్పందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, ఏపీ సచివాలయంలో ఎన్నో అధికారిక ఫైళ్లు, ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉండగా, వర్కింగ్ డే రోజున హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మీ ఇల్లు పిఠాపురంలో ఉందనుకున్నాం, మీకు ఏమైనా ప్రెస్మీట్లు ఉంటే మీరు గెలిచిన, మిమ్మల్ని నమ్మిన ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్టుకోవాలి కానీ హైదరాబాద్‌లో మీకేం పని?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉంటూ, తెలంగాణలో మళ్లీ మత రాజకీయాలు లేదా చెరువుల కబ్జాల గురించి మాట్లాడటానికి వస్తున్నారా అంటూ కొందరు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, జూబ్లీహిల్స్‌లో కూర్చుని రాజకీయం చేయడంపై మండిపడుతూ, అసలు మీరు ఏ రాష్ట్రానికి సేవ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ కళ్యాణ్‌ను సూటిగా నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే ప్రెస్‌మీట్ ఎలాంటి వివాదాలకు దారితీస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Sir,
Today is a working day in Andhra Pradesh.
Files in AP are waiting.
Your responsibilities in AP are waiting.
But you’re hosting a press meet in Hyderabad.
Deputy CM of AP.
Elected from Pitapuram.
Sitting in Jubilee Hills.
Sir, which state are you actually serving?— DreamWeaverX (@DreamWeaverX999) June 2, 2026
I thought your home was in Pitapuram, AP.
Whatever pressmeets, do it in your state where you are elected…— Sukkumarkk (@StrictlyAsking) June 2, 2026
You’re a minister in Andhra Pradesh
Why is your residence in Telangana ?Is Andhra Pradesh unsafe under your governance ?
— Rakita 🧂 (@Rakita_IND) June 2, 2026