వరల్డ్ అథ్లెటిక్స్.. జావెలిన్ త్రో ఫైనల్లోకి నీరజ్ చోప్రా, రోహిత్
ఒరేగాన్: అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్లో ఇద్దరు ఇండియన్లు ఫైనల్ చేరడం అథ్లెటిక్స్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించారు. హీట్స్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ తన జావెలిన్‌ను 88.39 మీటర్ల దూరం విసిరాడు. మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించాడు. రోహిత్ తన జావెలిన్‌ను 80.42 మీటర్ల దూరం విసిరాడు.
క్వాలిఫికేషన్ తొలి త్రోలోనే నీరజ్ చోప్రా తన జావెలిన్‌ను 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. చోప్రా గ్రూపు ఏ నుంచి పోటీలోకి దిగారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్ ఈవెంట్ జరగనున్నది. వరల్డ్ చాంపియన్‌షిప్ జావెలిన్ ఈవెంట్లో 83.50 మీటర్లు ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్. గ్రూపు ఏలో చోప్రానే బెస్ట్ త్రో వేశాడు. ఇక గ్రెనెడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో అత్యధికంగా 89.91 మీటర్ల దూరం విసిరాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో పదవ స్థానంలో నిలిచిన రోహిత్ యాదవ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం.
Historical morning for #IndianAthletics🇮🇳 at @WCHoregon22
✅️#EldhosePaul becomes the 1st Indian to reach Men's Triple Jump Final with a jump of 16.68m; finishing 12th (Q)
✅️@RohitJavelin joins @Neeraj_chopra1 in Javelin Final with a throw of 80.42m; finishing 11th (Q)
1/1 pic.twitter.com/JmHbbUE8HP
— SAI Media (@Media_SAI) July 22, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

