ప్రస్తుతం ఎఫ్3 సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ దర్శకుడు ఇక నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో చేయబోయే ఎన్బీకే 108 (NBK 108)పై ఫోకస్ పెట్టనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులను మొదలు పెట్టి..సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. కాగా బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా క్రేజీ టైటిల్‌ను ప్రకటించబోతున్నాడని ఇప్పటికే ఓ అప్ డేట్ కూడా తెరపైకి వచ్చింది.
ఇపుడు దీనికి సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి బ్రో ఐ డోంట్ కేర్ (Bro I Don’t Care) అనే టైటిల్‌ను ఫైనల్ చేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ముందుగా ఐ డోంట్ కేర్ పేరు అనుకున్న అనిల్ రావిపూడి..యూత్‌కు, బాలకృష్ణ అభిమానులకు మరింత కనెక్ట్ అయ్యేలా ఉండేందుకు బ్రో అని యాడ్ చేశాడట. అంతా అనుకున్నట్టుగానే మరి పుట్టినరోజున ఆ టైటిల్ ఏంటో ప్రకటిస్తారా..? అనేది చూడాలి.
ఈ ప్రాజెక్టులో బాలకృష్ణ కూతురిగా పెళ్లి సందD ఫేం శ్రీలీల నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ బాలకృష్ణకు జోడీగా కనిపించబోతుందట. పటాస్ లైన్లో యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందట ఈ ప్రాజెక్టు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు.