Nasal Spray For COVID-19 | ప్రస్తుతానికి కొవిడ్ తీవ్రత తగ్గింది. కానీ ఆ ప్రభావం సమసి పోలేదు. త్వరలోనే నాలుగో వేవ్ రావచ్చనే సంకేతం వినిపిస్తున్నది. ఇప్పటికే చైనా, ఇంగ్లండ్‌ల నుంచి కొవిడ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ శుభవార్త! బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు… కొవిడ్ వైరస్ ఊపిరితిత్తుల్లోకి చొరబడకుండా అడ్డుకునే స్ప్రేను రూపొందించారు. పీలిస్తే చాలు, ఇందులోని N-0385 అనే రసాయన ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. వైరస్‌ను నిర్వీర్యం చేస్తుంది. ఇప్పటికే ఈ మందును ఎలుకల మీద, మనుషుల ఊపిరితిత్తులను పోలిన కణజాలం మీద విజయవంతంగా ప్రయోగించారు. ఈ మందు ఒమైక్రాన్‌తో పాటు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్ల మీద తిరుగులేని ప్రభావం చూపినట్టు తేలింది.
“కరోనాకు ఇవే తారకమంత్రం..! లోకల్ సర్కిల్ సర్వేలో కీలక విషయాలు..!!”
Covid-19 | కరోనా విధ్వంసం.. ప్రపంచవ్యాప్తంగా 50కోట్ల మార్క్‌ను చేరిన కేసులు”
కొత్త వేరియంట్ ఇండియాలోకి వచ్చేసింది.. దీన్నుంచి ఎలా రక్షణ పొందాలి?”
Stealth Omicron | హార్ట్‌రేట్ పెరుగుదల గుండెజబ్బులకే కాదు.. కరోనాకూ సంకేతం.. నిపుణుల హెచ్చరిక..!”