నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310.8 498 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8604 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7436 క్యూసెక్కు లు, ఎస్ ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, వరదకాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28461 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 62817 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశై లం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 882.20 అడుగులు (200.1971 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 75789 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.