నాగచైతన్య నిధి అన్వేషకుడి పాత్రలో నటిస్తున్న మిథికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఫస్ట్‌గ్లింప్స్‌ను మార్చి 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో నాగచైతన్య ఓ చీకటి గుహలో నిలబడి చేతిలో ఆయుధం, ైక్లెంబింగ్ గేర్‌తో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఈ సినిమాలో నాగచైత్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మగిరి పర్వతాల్లో నిధి అన్వేషణ కోసం అతను చేసే సాహసాలు, ఈ క్రమంలో ఆయనకు పరిచమయ్యే ఓ మార్మిక ప్రపంచం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని, ఈ సినిమా కోసం నాగచైతన్య ప్రత్యేక శిక్షణ తీసుకొని శారీరకంగా మరింత దృఢంగా తయారయ్యారని మేకర్స్ తెలిపారు. మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, దర్శకత్వం: కార్తీక్ దండు.