Naga Chaitanya | టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, దర్శకుడు దేవకట్టా, కాంబోలో ‘మయసభ’ అనే పొలిటికల్ డ్రామా రాబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా నాగ చైతన్య టీమ్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
దేవా కట్టా ‘మయసభ’లో నాగ చైతన్య నటిస్తున్నాడనే వార్తలను ఆయన టీమ్ ఖండించింది. చైతన్య ప్రస్తుతం తన 24వ చిత్రం ‘NC24’పైనే పూర్తిగా దృష్టి సారించాడని స్పష్టం చేసింది. అభిమానులు, మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
మరోవైపు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NC24’ మిస్టికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించే అవకాశం ఉంది. ‘NC24’తో చైతన్య సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారు.