బీజింగ్: చైనాకు చెందిన యూటూ-2 రోవర్ చంద్రుడిపై ఓ వింత నిర్మాణాన్ని గుర్తించింది. ఘనాకారంలో ఉన్న ఈ నిర్మాణాన్ని చైనా ‘రహస్య గుడిసె’గా పిలుస్తున్నది. యూటూ రోవర్ చందమామపై వాన్ కర్మాన్ బిలంలో మట్టి నమూనాలు సేకరిస్తున్నది. ఈ బిలం నుంచి 80 మీటర్ల దూరంలో ఈ వింత నిర్మాణం ఉన్నది. నవంబర్లోనే దీన్ని గుర్తించినట్టు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. గ్రహాంతరవాసులు కట్టిన ఇల్లా లేక చంద్రుడిపై పరిశోధనలకు ఇంతకుముందు ఎవరైనా పంపిన స్పేస్ క్రాఫ్టా అనేది పరిశోధించనున్నట్టు పేర్కొన్నది.