దేవరకొండ, డిసెంబర్ 8: ఓ యువకుడు కత్తితో పొడుచుకునేందుకు యత్నించగా.. అడ్డుకోబోయిన వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జేత్యాతండాలో బుధవారం చోటుచేసుకున్నది. తండాకు చెందిన రవి కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. సమీపంలోని ఇస్లావత్ బంగారం (60) అనే వృద్ధురాలు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అతడు ఆమె ఛాతిపై కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది.