లక్నో : బీరు మరిగిన కోతి రోజూ వైన్ షాపులో దూరి మద్యం సేవిస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలోని రాయ్‌బరేలిలోని వైన్ షాపులో కోతి హంగామా షాపు నిర్వాహకులకు తలనొప్పిగా మారింది.
UP ke रायबरेली दारू पीता है यह बंदर, वायरल वीडियो देख हैरान हुए लोग…
लोगों से जबरदस्ती छीन लेता है शराब की बोतलें
शराब न मिले तो ठेके पर करता है हंगामा
मुंह में शराब की बोतल लगाकर गटक रहा बंदर pic.twitter.com/Jro1666vD0— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) October 31, 2022
అచల్‌గంజ్ ప్రాంతంలోని లిక్కర్ షాపులో సిబ్బంది మద్యానికి బానిసైన మంకీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీరుకు అలవాటు పడిన కోతి మద్యం బాటిళ్లను గుంజుకుని తాగుతోందని వారు వాపోతున్నారు. వైన్స్ నిర్వాహకులు కోతి ఆగడాలపై అటవీ సిబ్బందికి మొరపెట్టుకున్నారు.
వానరుడి బారి నుంచి తమను కాపాడాలని కోతిని తీసుకువెళ్లాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వైరల్ వీడియోలో కింగ్‌ఫిషర్ బీరును సేవిస్తున్న కోతిని చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు.