అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, ఆపై ఆత్మహత్య చేసుకునేలా..
అత్యాచారం| వాళ్లిద్దరు అక్కాచెల్లెళ్లు. తండ్రిలేడు. తల్లేమో డైలీ లేబర్. పక్కింట్లో ఉన్న నలుగురు పోరగాళ్లు వాళ్లపై కన్నేశారు. అదునుచూసి కాటేశారు. ఆపై వారు బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

న్యూఢిల్లీ: వాళ్లిద్దరు అక్కాచెల్లెళ్లు. తండ్రిలేడు. తల్లేమో డైలీ లేబర్. పక్కింట్లో ఉన్న నలుగురు పోరగాళ్లు వాళ్లపై కన్నేశారు. అదునుచూసి కాటేశారు. ఆపై వారు బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. పాముకాటుతో చనిపోయారని చెప్పాలని, లేదంటే హత్యచేస్తామని వాళ్ల తల్లిని బెదిరించారు. ఆఖరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కబెడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది.
ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో సోనిపట్‌లో ఉంటున్నది. భర్త లేకపోవడంతో కూలినాలి చేసుకుంటూ తన 14, 16 ఏండ్ల కూతుళ్లను పోషించుకుంటున్నది. వారుంటున్న ఇంటిపక్కనే నలుగురు కుర్రాళ్లు ఉంటున్నారు. వారు వలస కార్మికులు. ఆ నలుగురు యువకుల కన్ను ఆ ఇద్దరు యువతులపై పడింది. ఈనెల 5, 6 తేదీల్లో ఇద్దరు అమ్మాయిలపై లైంగికదాడి చేశారు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోవాలని వారిపై ఒత్తిడిచేశారు. పాము కాటేసిందని చెప్పాలని వారి తల్లికి చెప్పారు. లేదంటే ఆమెను చంపుతామని బెదిరించారు.
అయితే.. ఆత్మహత్యకు పాల్పడిన అక్కాచెల్లళ్లను స్థానికులు ఢిల్లీలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే ఒకరు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. మరొక అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయింది. పాము కాటేసిందని వారి తల్లి వైద్యులకు చెప్పింది. కాగా, విషయం పోలీసులకు తెలిసింది. తల్లిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
RC17 Casting Call | రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుందా?.. క్యాస్టింగ్ కాల్ ప్రకటించిన మేకర్స్!
‘ఉద్యాన క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలి’
ACB Raids | మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజినీర్లు
Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

