Minister Harish Rao | సీఎం కేసీఆర్ వ్యూహాలకు ప్రతిపక్షాలు బేజారు : మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao | సీఎం కేసీఆర్ వ్యూహాలకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపు మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు.
మెదక్ : సీఎం కేసీఆర్ వ్యూహాలకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. రేపు మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు. మెదక్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ నూతన ఉత్సాహంతో సభ జరుగనుందని పేర్కొన్నారు.
కేసీఆర్ వ్యూహానికి కకావికలం..
కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ ఊహించలేదు. ఎమ్మెల్యే అభ్యుర్థుల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయి. మెదక్‌లో పదికి పది సీట్లు పక్కా గెలిచి సీఎం కేసీఆర్‌కు గెలుపు బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా, వారిని ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. టేకేదార్లకు కూడా పింఛను ఇచ్చే కార్యక్రమం సీఎం కేసీఆర్ మెదక్ వేదికగా ప్రారంభిస్తారు. అలాగే దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్లు కూడా అందిస్తారని, అనంతరం మధ్యాహ్నం 3గంటల బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు.
బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్న తేడా అదే..
బీఆర్ఎస్ పాలనలో మెదక్ రూపు రేఖలు మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఓకే సారి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ప్రకటించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్లకు లీడర్లు లేరు, బీజేపీ వాళ్లకు కేడర్ లేదు. యువత, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున జై కొడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని చెప్పారు. కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా కేంద్రం కాపీ కొట్టిందని గుర్తు చేశారు. మనం పూర్తిగా ఉచితంగా లక్ష రూపాయలు అందిస్తే, కేంద్రం లోన్ల రూపంలో ఇస్తుందట. బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్న తేడా ఇదేనన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన..
అంతకుముందు అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.బుధవారం సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. మెదక్ సమీకృత కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు, ఆర్ అండ్ బీ, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై సూచనలు చేస్తున్న మంత్రి
బహిరంగ సభకు ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

