సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

హైదరాబాద్ : కొత్తగా నియామకమైన పంచాయతీ కార్యదర్శుల వేతనాలను, ప్రస్తుతం పని చేస్తున్న కార్యదర్శుల వేతనాలకు సమానంగా పెంచుతున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కొత్తగా నియామకమైన 9,355 మంది కార్యదర్శులకు సమాన పనికి సమాన వేతనంగా ఇప్పుడున్న జీతాలకు రెట్టింపు కంటే ఎక్కువ జీతాలు వస్తాయన్నారు.
గత కొంత కాలంగా కొత్త గ్రామ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్న డిమాండ్ సీఎం హామీతో నెరవేరిందన్నారు. ప్రొబేషనరీ పిరియడ్ ని నాలుగేండ్లకు పెంచడానికి గల కారణాలను కూడా సీఎం తెలిపారన్నారు. కార్యదర్శులు మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని మంత్రి కోరారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతానికి గ్రామ కార్యదర్శుల పనితనమే కారణమన్నారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంలో రాజీ లేకుండా గతంలో మాదిరిగానే కరోనా కట్టడికి పూర్తి క్రమశిక్షణతో పని చేయాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

