టాలెంట్‌కు చేతులతో పనేంటి.. కాళ్లు, నోటితోనే అద్భుతమైన బొమ్మలు గీసేస్తున్నరు !!
MFPA | కుడిచేతితో చేయాల్సిన పనిని ఎడమచేతితో చేయాలంటేనే ఇబ్బంది పడతామే! అలాంటిది అసలు చేతులే లేకుండా చిత్రాలు గీయడమంటే? ఎంత కష్టం, ఎంత కష్టం? ఎంఎఫ్‌పీఏ సంస్థకు చెందిన చిత్రకారులు మాత్రం చేతుల్లేకపోయినా కళ్లు చెదిరే చిత్రాలు గీస్తున్నారు. వీళ్లు ప్రాణంపోసే పెయింటింగ్స్ కాన్ఫరెన్స్ హాళ్లకూ, డిజైనర్ బెడ్రూమ్లకూ అతికినట్టు సరిపోతాయి.

అక్కడో పెయింటింగ్ కాంపిటీషన్ నడుస్తున్నది. మొదటి బహుమతి ప్రకటించారు. విజేతను వేదిక మీదికి పిలుస్తున్నారు నిర్వాహకులు. ఒకటోసారి. రెండోసారి. మూడోసారి. అయినా స్పందన లేదు. అనుసంధానకర్త స్వరంలో కించిత్ అసహనం. అంతలోనే చక్రాల కుర్చీలో ఓ యువకుడొచ్చాడు. ‘ఆ బొమ్మ గీసింది నేనే..’ అని చెప్పడానికైనా చేయి పైకెత్తలేని పరిస్థితి. నిటారుగా నిలబడటం చేతకాకపోయినా, నోటితోనే కుంచె పట్టుకుని అతను గీసిన ఆ చిత్రం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అతను.. మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్ (ఎంఎఫ్‌పీఏ) సంస్థ సభ్యుడు.

ఓ చేదు అనుభవంలోంచి..
ఇతనొక్కడే కాదు.. ఆ బృందంలోని సభ్యులంతా నోటితోనో, కాలితోనో బొమ్మలు గీసేవారే. ఆ వైకల్యం కొందరికి పుట్టుకతోనే ఉంది. మరికొందరు సెరెబ్రల్ పార్సీ, వెన్నెముక దెబ్బతినడం, రోడ్డు ప్రమాదం.. తదితర కారణాల వల్ల కదలికలను కోల్పోయారు. ఆ దురదృష్టకర పరిణామం.. ఎవరికి వారిని కుంగదీసింది. అదీ తాత్కాలికమే. నెమ్మదిగా అభిరుచులకు మెరుగులు పెట్టారు. చేతుల్లేకపోతేనేం, నోటితోనే కుంచె పట్టారు. పెదాలనే వేళ్లుగా మలుచుకున్నారు. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన భావాలకు చిత్రరూపం ఇచ్చారు. ఆ సంకల్పబలమే విజయతీరాలకు నడిపించింది. ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఐరోపా దేశాల్లో ఎనిమిది మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం భారత్ సహా 74 దేశాలకు చెందిన ఎనిమిది వందల మందికిపైగా సభ్యులున్నారు. ఇందులో కాలితో బొమ్మలు గీసే నరసింహులులాంటి తెలుగువాళ్లూ ఉన్నారు. ఎంఎఫ్‌పీఏ సంస్థకు సంబంధించిన వెబ్సైట్ ద్వారా ఈ బృందంలోని కళాకారులు గీసిన చిత్రాలను అమ్ముతారు. వాళ్లు వేసిన పెయింటింగ్స్‌కు ఓ డిజిటల్ రూపమిచ్చి వాటిని బ్యాగులు, పర్సులు, టీషర్ట్లు, స్కార్ఫ్‌లు, కప్పులు, గ్రీటింగ్‌కార్డులు, క్యాలెండర్లు… ఇలా అన్నిటి మీదా ప్రింట్ చేసి విక్రయిస్తున్నారు. మనం వీటిలో దేన్ని ఎంచుకున్నా ఆ డిజైన్‌ను ఎవరు రూపొందించారో కనిపిస్తుంది. వచ్చిన సొమ్ములో కొంత వాళ్లకూ చెందుతుంది. చివరగా మన ఇంటికి చేరే అందమైన చిత్రం.. సంతోషంతో పాటు సంతృప్తినీ తీసుకువస్తుంది. అసలైన కళాభిమానం అదే.

Read More :
“కాగితాలతో అబ్బురపరిచే శిల్పాలు తయారు చేస్తున్నాడు”
“Nakashi Paintings | జానపద కథలకు ప్రాణం పోస్తున్న నకాశీ పటాలు.. వీటి ప్రత్యేకత ఏంటి?”
అంతరించిపోతున్న కూనపులి కళను కాపాడుతున్న ఒకే ఒక్కడు.. అసలు దాని ప్రత్యేకత ఏంటి?”
అద్భుతాలు సృష్టిస్తున్న 3డీ ప్రింటింగ్.. మీకు నచ్చిన వారి ఫొటోలను ఇలా బొమ్మలుగా మార్చేసుకోండి”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

