ఇంట్లో సమస్యకు పరిష్కారం ఏంటి?
నేనొక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నాను. నా వయసు పద్దెనిమిది. ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండేండ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయాను. నేను ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను గారాబంగా చూసుకునేవారు. కన్నవాళ్ల మరణం తర్వాత మేనమామ తన ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ల ప్రేమ, ఆప్యాయతలు చూసి కష్టాలన్నీ మరిచిపోయాను. అంతలోనే మా అత్త నన్ను కసురుకోవడం ప్రారంభించింది. మామయ్య డ్యూటీకి వెళ్లగానే ఇంట్లో పనంతా నాతోనే చేయిస్తున్నది
నేనొక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నాను. నా వయసు పద్దెనిమిది. ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండేండ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయాను. నేను ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను గారాబంగా చూసుకునేవారు. కన్నవాళ్ల మరణం తర్వాత మేనమామ తన ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ల ప్రేమ, ఆప్యాయతలు చూసి కష్టాలన్నీ మరిచిపోయాను. అంతలోనే మా అత్త నన్ను కసురుకోవడం ప్రారంభించింది. మామయ్య డ్యూటీకి వెళ్లగానే ఇంట్లో పనంతా నాతోనే చేయిస్తున్నది. అయినా ఓపికతో చేస్తూనే ఉన్నాను. తరచూ సూటిపోటి మాటలు అంటున్నది. ఆ చిన్నచూపు భరించలేకపోతున్నా. ఇంటి పనుల వల్ల చదువుకోవడానికి సమయం దొరకడం లేదు. దీంతో గ్రేడ్స్ తగ్గిపోతున్నాయి. మానసికంగా కుంగిపోతున్నాను. ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్లిపోదామని అనిపిస్తున్నది. కానీ, మామయ్య మంచితనాన్ని చూసి ఆగుతున్నాను. నా సమస్యలన్నీ మామయ్యకు చెప్పి వాళ్లిద్దరి మధ్యా గొడవలు సృష్టించడం నాకు ఇష్టం లేదు. సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. చదువేమో ముందుకు సాగడం లేదు. ప్రతిక్షణం అమ్మానాన్నలే గుర్తుకొస్తున్నారు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండి.
– ఓ సోదరి
మీ సమస్య అత్తమ్మతోనే కాబట్టి.. మొదట ఆమెతోనే మనసువిప్పి మాట్లాడండి. మీ భావోద్వేగాలను అర్థమయ్యేలా చెప్పండి. పనివల్ల చదువుకు ఆటంకం కలుగుతున్న విషయాన్నీ వివరించండి. తను కూడా ఓ తల్లే కాబట్టి, మీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఉంది. వినకపోతే.. మీ స్నేహితురాళ్లు ఎవరైనా హాస్టల్స్‌లో ఉంటున్నారేమో వాకబు చేయండి. అవసరమైతే రెండ్రోజులు గెస్ట్‌గా వెళ్లి, అక్కడి పరిస్థితులు అవగాహన చేసుకోండి. అన్నీ సవ్యంగా ఉంటే.. మామయ్యను ఒప్పించే ప్రయత్నం చేయండి. జీవితంలో అనేక అవరోధాలు ఎదురవుతాయి. అవసరమైతే పోరాడాలి.
మీకంటూ ఓ ఉన్నత లక్ష్యం సిద్ధం చేసుకోండి. ఆ విషయం మామయ్యకు చెప్పండి. అమ్మానాన్నల ఆస్తి నుంచి కావాల్సిన డబ్బును సమకూర్చుకోండి. ధైర్యంగా, స్వతంత్రంగా బతకడం అలవాటు చేసుకోండి. పండగలు, సెలవులకు మామయ్య వాళ్ల ఇంటికే వెళ్లొచ్చు. అంత కష్టపెట్టినా.. తన భర్తకు మీరు ఒక్కమాట కూడా చెప్ప లేదనే విషయం కనుక అత్తమ్మకు బోధపడితే.. తనే మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానించొచ్చు. మీకంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని.. ఉన్నతస్థితిలో నిలిచినవారు ఎంతోమంది. ఆ జీవితాల నుంచి స్ఫూర్తి పొందండి. ఏ ఒక్కరి కారణంగానో మన జీవనయాత్ర ఆగిపోకూడదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

