Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
Mammootty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి శుక్రవారం జరిగిన 'ఓం' ప్రీ-రిలీజ్ వేడుకలో తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి శుక్రవారం జరిగిన ‘ఓం’ ప్రీ-రిలీజ్ వేడుకలో తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సినిమా విశేషాలను పంచుకుంటూ సరదాగా, అదే సమయంలో ఆసక్తికరంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘పేరన్బు’ చిత్రం తర్వాత సరిగ్గా ఏడేళ్లకు తాను మళ్లీ ఒక తమిళ సినిమా చేస్తున్నానని మమ్ముట్టి తెలిపారు. ఆ సినిమా తర్వాత మరిన్ని మంచి తమిళ ప్రాజెక్ట్‌లు చేయాలని చాలా మందిని అడిగానని, కానీ ఎవరూ తనను పట్టించుకోలేదంటూ ఆయన చమత్కరించారు. అయితే, ఈ ‘ఓం’ సినిమా మాత్రం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. సూపర్‌స్టార్ రజనీకాంత్, ధనుష్ వంటి దిగ్గజ నటులతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. “ఇప్పుడు నా పక్కనే ధనుష్ కొడుకు ఉన్నాడు, వాడు ఎప్పుడు సినిమాల్లోకి వచ్చి నటిస్తాడో నాకైతే తెలియదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.
ఈ చిత్ర కథాంశం గురించి మాట్లాడుతూ.. ఇందులో ఎన్నో వైవిధ్యమైన భావోద్వేగాలు ఉన్నాయని తెలిపారు. సామాన్య ప్రజల జీవితాలతో ముడిపడిన కొండ ప్రాంతపు నేపథ్యం, సాయిపల్లవి పాత్ర, ధనుష్ పాత్ర.. ఇలా ఎన్నో కథలు ఈ చిత్రంలో ఉన్నాయని, అయితే సినిమా కథను మాత్రం తాను ఇప్పుడే పూర్తిగా రివీల్ చేయబోనని స్పష్టం చేశారు. షూటింగ్ అనుభవాలను వివరిస్తూ.. ఈ సినిమా షూటింగ్ కేవలం 45 రోజుల్లో పూర్తవుతుందని మొదట్లో తనకు చెప్పారని, కానీ అది కాస్తా ఆరు నెలలకు పైగా సాగిందని చెప్పారు. ఇందులో స్మగ్లర్ నేపథ్యంలో సాగే ఘట్టాలు ఉండటంతో చాలా వరకు రాత్రిపూటే షూటింగ్ చేయాల్సి వచ్చిందని సరదాగా గుర్తుచేసుకున్నారు. తన ప్రసంగం ఎప్పుడూ సరదాగా నవ్వులు పంచేలా ఉంటుందని, కానీ ఈ సినిమా మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఎంతో సీరియస్‌గా ఉంటుందని మమ్ముట్టి తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను కేవలం దృశ్యపరంగానే కాకుండా, వారి మనసులను హత్తుకునేలా తీవ్రమైన భావోద్వేగాలకు గురి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

