Manisha Gera Baswani | ఒక మనిషిని ఎదురుగా నిలబెట్టి.. ‘స్మైల్ ప్లీజ్’ అంటూ ఫొటో తీయడం ఒక పద్ధతి. అందులో కృత్రిమత్వమే ఎక్కువ. అదంతా తెచ్చిపెట్టుకున్న నవ్వు అని అర్థం అవుతూనే ఉంటుంది. కానీ, ఆ వ్యక్తికి తెలియకుండా చాటు నుంచి ఫొటో తీసినప్పుడు.. హావభావాలు, ఉద్వేగాలు కెమెరా కండ్లకు దొరికిపోతాయి. పాకిస్థాన్‌కు చెందిన రూహీ అహ్మద్ అనే కళాకారిణి ఓసారి రెడ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్‌ను సరిచేస్తుండగా ఆమెకు తెలియకుండానే ఫొటో తీశారు మనీష గేరా బస్వానీ. చూసేవారికి అదో నాట్య భంగిమలా అనిపిస్తుంది. ఇలా, చాటుగా తీసిన ఎన్నో ఛాయా చిత్రాలతో ‘ట్రావెలాగ్: ఆర్టిస్ట్స్ త్రూ ద లెన్స్’ పేరిటలండన్లో ఓ ఎగ్జిబిషన్ నిర్వహించారు మనీష. ఆమె కెమెరాకు చిక్కినవారిలో దక్షిణాసియాకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. ఇండియా- పాకిస్థాన్ విభజన తర్వాత మనీష తల్లిదండ్రులు పాక్‌లో స్థిరపడ్డారు.