Smriti Mandhana : అంతర్జాతీయ క్రికెట్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) రికార్డుల మోత మోగిస్తోంది. మూడు ఫార్మాట్లలో కలిపి మూడొందలకు పైగా మ్యాచ్‌లు ఆడిన మంధాన.. అత్యధిక పరుగుల జాబితాలో రెండో ర్యాంక్ సాధించింది. మహిళల ఆసియాకప్ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 19 పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బేట్స్‌ను దాటేసింది. అంతర్జాతీయంగా మహిళల క్రికెట్లో 10,756 రన్స్‌తో మంధాన రెండో స్థానంలో నిలిచింది.
భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డుల హోరు కొనసాగుతోంది. ఈమధ్యే లార్డ్స్ టెస్టుతో మూడొందల అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మంధాన.. అర్ధ శతకంతో చెలరేగింది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన లార్డ్స్ మైదానంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి మహిళల టెస్టులో తొలి ఫిఫ్టీ మంధాన నమోదు చేయడం విశేషం. మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న ఓపెనర్.. మరో రికార్డు పట్టేసింది.
The summit is calling ✨ pic.twitter.com/iTmorNZOot
— Cricinfo (@cricinfo) August 31, 2026
అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన రెండో మహిళగా అవతరించింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో థాయ్‌లాండ్‌పై 19 రన్స్ చేసిన మంధాన.. సుజీ బేట్స్(న్యూజిలాండ్ మాజీ క్రికెటర్)ను వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం మంధాన ఖాతాలో10,756 పరుగులు ఉండగా.. భారత్‌కే చెందిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్10,868 రన్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకూ 9 టెస్టుల్లో 788 పరుగులు, 120 వన్డేల్లో 5,411 రన్స్, 172 టీ20ల్లో 4,557 పరుగులు చేసిందీ మంధాన.
నిరుడు వన్డేల్లో వెయ్యి పరుగులతో చెలరేగిన మంధాన.. ఆస్ట్రేలియా దిగ్గజం బెలిండా క్లార్క్ (Belinda Clark) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్ధలు కొట్టింది. ఆసీస్ వెటరన్ అయిన క్లార్క్ 1997లో 970 రన్స్‌తో చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి .. దాదాపు 27 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డును మంధాన బ్రేక్ చేసింది. మొత్తంగా 18 ఇన్నింగ్స్‌ల్లో మంధాన 59.00 సగటుతో 1,062 పరుగులు సాధించింది.

అంతేకాదు వన్డేల్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగుల రాణుల జాబితాలో మంధాన టాప్‌లో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ 2022లో 882 రన్స్‌తో మూడో స్థానంలో ఉంది. డెబ్బీ హాక్లే (న్యూజిలాండ్) 1997లో 880 రన్స్‌తో నాలుగో స్థానంలో నిలవగా.. 2016 లో ఆ దేశానికే చెందిన అమీ సటెర్వైటీ 853 పరుగులతో ఐదో స్థానం దక్కించుకుంది.