పాత సీటు నుంచే మమత పోటీ.. రాజీనామా చేసిన పార్టీ ఎమ్మెల్యే

కోల్‌కతా: తాను నాయకత్వం వహిస్తున్న తృణమూల్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తను ఓడిపోవడం మమతా బెనర్జీకి ఒకకంట కన్నీరు మరొక కంట ఆనందబాష్పాలు తెప్పించే విషయం. సహాయకుడుగా ఉంటూ అదను చూసుకుని బీజేపీలోకి జంప్ చేసిన సువేందు అధికారికి గుణపాఠం చెప్పేందుకు ఆమె బెంగాల్ టైగర్‌లా ముందుకురికి నందిగ్రాం నుంచి పోటీ చేశారు. హోరాహోరీ పోరులో నాటకీయ పరిణామాల మధ్య ఆమె ఓడిపోయారు. వరుసగా మూడోసారి బెంగాల్ కోటలో పాగా వేసిన నాయకురాలికి ఆ ఓటమి బాధాకరమే. అయినప్పటికీ ఆమె బెంగాల్ సీఎం పదవి చేపట్టారు. నిబంధనల ప్రకారం మమత ఆరుమాసాల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాలి. తన పాత నియోజకవర్గమైన కోల్‌కతాలోని భవానీపూర్ నుంచే ఆమె అసెంబ్లీకి పోటీచేయబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆ స్థానంలో తృణమూల్ అభ్యర్థిగా శోభన్‌దేబ్ చటోపాధ్యాయ పోటీచేసి గెలిచారు. పార్టీ అధినేత్రి కోసం ఆయన ఆ సీటుకు రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నమే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ బిమాన్ బంధోపాధ్యాయకు అందజేశారు. ప్రస్తుతం శోభన్‌దేబ్ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఆరునెలల్లోగా మరో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరుమాసాల్లోగా ఎన్నిక కావాలి లేదా రాజీమానా చేయాలి అని రాజ్యాంగంలోని 164వ అధికరణం చెప్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

