
ఎల్బీనగర్, జనవరి 5 : కరాటే ఇండియా ఆర్గనైజేషన్ (కియో) టోర్నమెంట్ కమిటీ వైస్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ర్టానికి చెందిన రంగు మల్లికార్జున్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు విజయ్ తివారి, ప్రధాన కార్యదర్శి సంజీవ్‌కుమార్ జంగ్రా ఉత్తర్వులు జారీ చేశారు. మల్లికార్జున్ గౌడ్ నియామకం పట్ల విక్టరీ కరాటే సంస్థ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, చీఫ్ అడ్వైజర్ శివకుమార్, చైర్మన్ సదాశివుడు, ప్రధాన కార్యదర్శులు యు.శ్రీనివాస్, వెంకటేశ్, టెక్నికల్ డైరెక్టర్ సురేశ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.