రోజూ సలాడ్స్ మాత్రమే తీసుకుంటే బరువు తగ్గుతారన్నది అవాస్తవం. దీనివల్ల శరీరానికి సరైన పోషకాలు అందవు. ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది. కొన్ని కూరగాయలు పచ్చిగా తినకూడదనీ అంటారు.
భోజనానికి బదులు సలాడ్స్‌తో కడుపు నింపుకోవాలని అను కుంటే, రెండుమూడు కప్పులైనా తినాలి. మిగతా ఆహారంలో భాగంగా అయితే ఒక కప్పు చాలు.
భోజనంలో భాగంగా సలాడ్స్ తీసుకోవాలనుకుంటే గ్రిల్డ్ చీజ్, గ్రిల్డ్ చికెన్, శనగలు, రాజ్మా లాంటి గింజలనూ జోడించాలి. చిన్నగా తరిగిన బ్రకోలీ, టమాట, క్యారెట్, అవకాడో లాంటివి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.
రోజుకోరకం కూరలు లేదా గింజలతో సలాడ్స్ తయారు చేసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలూ లభిస్తాయి. రోజూ ఒకేరకం తిన్నట్టు కూడా అనిపించదు.
సమతుల భోజనంలో సలాడ్‌ను భాగం చేసుకుంటే.. శరీరానికి తక్కువ కార్బొహైడ్రేట్లు అందుతాయి. దీంతో పాటు అనారోగ్యకరమైన తిండికి దూరంగా ఉంటూ.. యోగాలాంటి వ్యాయామాలు చేస్తే బరువు తగ్గడం మరింత సులభం అవుతుంది.