వదులుగా సిగరెట్ల అమ్మకం నిలిపేయవద్దంటున్న స్మోకింగ్ ప్రియులు
న్యూఢిల్లీ : సిగరెట్లు తాగడాన్ని తగ్గించడంలో భాగంగా వదులుగా సిగరెట్ల అమ్మకం నిలిపివేయడాన్ని మెజార్టీ సిగరెట్ స్మోకింగ్ ప్రియులు వ్యతిరేకిస్తున్నారు.

న్యూఢిల్లీ : సిగరెట్లు తాగడాన్ని తగ్గించడంలో భాగంగా వదులుగా సిగరెట్ల అమ్మకం నిలిపివేయడాన్ని మెజార్టీ సిగరెట్ స్మోకింగ్ ప్రియులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్యాకెట్లు కొనడం మరింత ఎక్కువై ధూమపానం పెరగడం ఖాయమంటున్నారు వాళ్లు.
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై చట్టంలోని సవరణలపై సిగరెట్ తాగేవారు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునేందుకు వాణిజ్యేతర సంస్థ ప్రహార్.. ఒక సర్వే చేపట్టింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, గువాహటి, వడోదర నగరాలతోపాటు 14 నగరాల్లో సర్వే నిర్వహించారు.
సిగరెట్ తాగడానికి ప్రస్తుతం అనుమతిస్తున్న వయసును 18 నుంచి 21 ఏండ్లకు పెంచడాన్ని కూడా 78 శాతం స్మోకింగ్ ప్రియులు మద్దతు ఇవ్వలేదు. అలాగే, సిగరెట్లను వదులుగా కాకుండా ప్యాకెట్ మొత్తంగా అమ్మకాలు జరుపడాన్ని 87 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది ధూమపానాన్ని మానుకోవాలని చెప్పడం కన్నా పూర్తి ప్యాక్‌లు కొనుగోలు చేయమని బలవంతం చేస్తుందని, ఇది మరింత పొగాకు వినియోగం పెరుగుదలకు దారితీస్తుందని వారు భావిస్తున్నారు.
ఇదే సమయంలో సిగరెట్ తాగే అలవాటును తగ్గించుకోవడానికి వదులుగా అమ్మడంపై నిషేధం ఉపయుక్తంగా ఉంటుందని 57 శాతం మంది పేర్కొన్నారు. లూస్ సేల్స్ నిషేధిస్తే తాము పూర్తిగా సిగరెట్లు తాగడం మానుకునేందుకు ఉపయోగపడుతుందని కేవలం 7 శాతం మంది తెలిపారు.
పొగాకు వినియోగం కోసం వయస్సును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచడాన్ని 78 శాతం మంది మద్దతు ఇవ్వలేదు. 37 శాతం మంది పొగాకును వినియోగించాలా? వద్దా? అని నిర్ణయించుకోవడం తమ ప్రాథమిక హక్కు అని చెప్పారు. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి సిగరెట్లు అమ్మకూడదనుకోవడం వారు అక్రమ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తుందని 8 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
పుతిన్‌కు వ్యాక్సిన్.. ఫొటో విడుదల చేయకపోవడంపై అనుమానాలు
రైల్వే ప్లాట్‌ఫాంపై ఏనుగు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Cigarettes
- COTPA
- PRAHAR
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

