పలు సంఘాల ఆధ్వర్యంలో ఇంజినీర్లకు ఘన సన్మానం
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 15 : భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంజినీర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియన్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, ప్రధానకార్యదర్శి నస్కంటి నాగభూషణం, బాలయ్య, అక్కినేని నారాయణరావు, సూర్యనారాయణ, సిద్ధిరామప్ప, సుభాష్‌రెడ్డి, రాజసింహుడు, అశోక్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
పలు కళాశాలల్లో..
పాలమూరు, సెప్టెంబర్ 15 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీర్స్డే వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంజినీర్లుగా పనిచేసి పదవీ విరమణ పొందిన కళాశాల పూర్వవిద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే జయప్రకాశ్ నారాయణ ఇంజినీరిం గ్ కళాశాలలో విశ్వేశ్వరయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కళాశాల చైర్మన్ రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 15 : భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని జడ్చర్లలో ఇంజనీర్స్‌డేను ఘనంగా జరుపుకొన్నారు. సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఇంజనీర్లు నర్సింహులు, బుచ్చన్న, రాజారాం, జవహర్‌బాబును శాలువాతో సన్మానించారు. అలాగే ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు నయీమొద్దీన్, శ్యాంసుందర్, జమీలాబేగం, శంకర్‌బాబు, ప్రకాశ్, అయ్యన్న, వేణుగోపాల్, ఇమాముద్దీన్, సత్యనారాయణ, బాలమణి, స్వాతి, ఉమాబాయి, గోనెల రాధాకృష్ణ, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, సెప్టెంబర్ 15 : మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని హెచ్ఎం చంద్రకాంత్ అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని రుసుంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంజినీర్స్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు అక్షిత, సౌమ్య, శ్రీవల్లి రూపొందించిన మోడల్ భవనాన్ని పరిశీలించి అభినందించారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 15 : మండలంలోని చౌదర్పల్లి విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీర్స్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎస్ఈ విద్యాసాగర్, ప్రిన్సిపాల్ సుధాకర్, ప్రవీణ్‌కుమార్, జీహెచ్ఎంసీ డీఈఈ శ్రీనివాసాచారి, కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరావు, జయంత్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు కన్నయ్యశెట్టి, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి బాలీశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ తేజోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.