ముంబై, మే 24: దేశీయ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్, మొబిలిటీ సొల్యుషన్స్ కంపెనీ మెజెంటా..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ ఏడాది కొత్తగా హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఇందుకోసం కొత్తగా 340 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. నియమించుకోనున్న వారిలో ఎంట్రి లెవల్, మధ్యస్థాయి అనుభవం కలిగిన సిబ్బందిని దేశవ్యాప్తంగా ఉన్న పలు క్యాంపస్‌లు, టైర్-1, టైర్-2 ఇనిస్టిట్యూట్ల నుంచి రిక్రూట్ చేసుకోనున్నది. ముఖ్యంగా మానవ వనరులు, ఫైనాన్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో అనుభవం ఉన్నవారికి పెద్దపీట వేయనున్నట్లు తెలిపింది.