Bhanu Kiran | మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్
Bhanu Kiran | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్‌కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసుల్లో భాను కిరణ్‌కు బెయిల్ లభించింది. అయితే బెయిల్ లభించిన కూడా భాను కిరణ్ జైలులోనే ఉండనున్నాడు.
Bhanu Kiran | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్‌కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసుల్లో భాను కిరణ్‌కు బెయిల్ లభించింది. అయితే బెయిల్ లభించిన కూడా భాను కిరణ్ జైలులోనే ఉండనున్నాడు. మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్ లభించిన కూడా జీవిత ఖైదు కింద జైలు జీవితం గడపనున్నాడు భాను కిరణ్.
ప్రస్తుతం భాను కిరణ్ చంచల్‌గూడ జైలులో కారగార శిక్ష అనుభవిస్తున్నాడు. 12 ఏండ్లుగా ఇదే జైలులో ఉంటున్న భాను కిరణ్ తన జీవిత ఖైదు కేసుపై క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు స్థానిక కోర్టులో తేల్చుకోమని స్పష్టం చేసింది. కాగా ఈ పిటిషన్‌కు సంబంధించి ఈ నెల 11న (నవంబర్ 11, 2024) విచారణకు రానుంది.
టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరి. తన కుటుంబంలో ఉన్న అందరిని హత్య చేశాడు అన్న కోపంతో పరిటాల రవి చంపాలని నిర్ణయించుకున్నాడు సూరి. ఈ క్రమంలోనే 2005లో పరిటాల రవిని కాల్చి చంపాడు. ఇక పరిటాల రవిని హత్య చేసిన కేసులో జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన సూరిని 2011 జనవరి 4న భాను కిరణ్ కాల్చి చంపాడు. అనంతపురం ఫ్యాక్షన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తోచ్చే పేర్లు పరిటాల రవి, మద్దెలచెరువు సూరి, మొద్దు శీను, ఓం ప్రకాశ్, భాను కిరణ్. దీనిపైనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2010లో రక్త చరిత్ర అనే సినిమా కూడా తీశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

