LPG Booking | అది ఫేక్ న్యూస్.. సిలిండర్ బుకింగ్ నిబంధనలపై కేంద్రం కీలక ప్రకటన!
LPG | వంటగ్యాస్ (LPG) సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
Gas Booking | వంటగ్యాస్ (LPG) సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ (MoPNG) ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. సిలిండర్ల బుకింగ్ గడుపు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజుల తర్వాతే రీఫిల్ బుకింగ్.. ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 45 రోజుల తర్వాత బుకింగ్‌కు అనుమతి అంటూ పలు వార్తలు వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫేక్ వార్తలపై పెట్రోలియం శాఖ స్పందించింది.
వంటగ్యాస్ (LPG) సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయంటూ వస్తున్న వార్తలు అబద్దం. ప్రస్తుతం అమలులో ఉన్న పాత నిబంధనలే కొనసాగుతాయని, ఎటువంటి కొత్త పరిమితులు విధించలేదని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం, రెండు సిలిండర్ల బుకింగ్‌ల మధ్య ఉండాల్సిన కనీస కాలవ్యవధిలో ఎటువంటి మార్పు లేదు. పట్టణ ప్రాంతాల్లో (Urban Areas) ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో (Rural Areas) రెండు బుకింగ్‌ల మధ్య కనీసం 45 రోజుల విరామం ఉండాలని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సరిపడా ఉందని, ఎటువంటి కొరత లేదని భరోసా ఇచ్చిన మంత్రిత్వ శాఖ, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి భయంతో ముందే బుకింగ్‌లు (Panic Booking) చేసుకోవద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. గ్యాస్ సరఫరా వ్యవస్థ అత్యంత సజావుగా సాగుతోందని, అర్హులైన ప్రతి వినియోగదారుడికి సకాలంలో సిలిండర్ అందుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
Clarification: LPG Refill Booking Timings
Reports circulating in sections of the news and on social media about changes in LPG refill booking norms are incorrect.
There is no change in LPG refill booking norms.
• Minimum gap between two refill bookings remains:
– 25 days in… pic.twitter.com/QqTlQYPaHp— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 25, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- GasBooking
- IndiaNews
- LPG
- LPGUpdate
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

