గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు ఆకస్మిక ఆందోళనకు దిగారు. తమ లారీలను కార్యాలయం ఎదుట నిలిపి, జిల్లా రవాణా శాఖ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు
జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు ఆకస్మిక ఆందోళనకు దిగారు. తమ లారీలను కార్యాలయం ఎదుట నిలిపి, జిల్లా రవాణా శాఖ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వాహనాలకు స్టిక్కర్లు వేసే పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఎలాంటి కారణం లేకుండా జరిమానాలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్టిక్కర్ల పేరుతో వాహనదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని, అనవసరంగా జరిమానాలు విధిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లారీ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ఈ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
లారీలను కార్యాలయం ఎదుట రోడ్డుపై నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అక్రమ వసూళ్లను నిలిపివేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని డ్రైవర్లు హెచ్చరించారు.
లారీ డ్రైవర్ల ఆందోళనకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమస్యపై జిల్లా రవాణా శాఖ అధికారి రాధికతో మాట్లాడారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Akhil | భార్యతో కలిసి జపాన్ చెక్కేసిన అఖిల్ అక్కినేని.. రెండు వారాల ట్రిప్ వెనుక అసలు కారణం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

