వార్ధాలో 60 గంటల లాక్డౌన్.. ఉల్లంఘిస్తే రూ.2వేల జరిమానా

ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 30వేల వరకు చేరాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. జిల్లా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా 60 గంటల పాటు లాక్డౌన్ విధించింది. శనివారం ఉదయం 8గంటల నుంచి 60 గంటల పాటు లాక్డౌన్ అమలులో ఉంటుందని కలెక్టర్ ప్రేర్నా పేట్రియాట్ పేర్కొన్నారు. ఈ సమయంలో అవసరమైన దుకాణాలు, మెడికల్ స్టోర్లు, పారిశ్రామిక ప్రాంతాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.2వేల జరిమానా విధించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం జిల్లాలో 251 మంది వైరస్ బారినపడగా.. నలుగురు మరణించారు. హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు నాగ్‌పూర్‌లోనే కరోనా తీవ్రత కొనసాగుతోంది. జిల్లాల వరుసగా నాలుగో రోజు 500కుపైగా పాజిటివ్ కేసులు రికార్డవగా.. ఏడుగురు మరణించారు. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు పూర్తి లాక్డౌన్ విధించగా.. తర్వాత కొంత సడలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

