గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థలు కీలకం
పరిపాలనా వ్యవస్థ బలోపేతానికే నిధులు: ఎమ్మెల్సీ కవిత
నిధుల కేటాయింపుపై ప్రజాప్రతినిధుల ధన్యవాదాలు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బడ్జెట్లో స్థానిక సంస్థలకు రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ చాంబర్, జడ్పీటీసీ, ఎంపీటీసీల సంఘం ప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో జిల్లా పరిషత్‌లకు రూ.252 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.248 కోట్లు కేటాయించిందని వివరించారు. పరిపాలనా వ్యవస్థలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్ర మరింత కీలకంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
జడ్పీటీసీలకు, ఎంపీపీలకు నిధుల కేటాయింపులో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు వివిధ సంఘాల ప్రతినిధులు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ప్రధానకార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, ఉపాధ్యక్షుడు అశోక్‌రావు, రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చింపుల శైలజ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పెరుమల్ల గుట్టయ్య, ఉపాధ్యక్షుడు కావలి శ్రీశైలం, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు నాగేశ్ సహా వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


