e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Home News రేప్‌ బాధితురాలికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించిన‌ మంత్రి

రేప్‌ బాధితురాలికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించిన‌ మంత్రి

రేప్‌ బాధితురాలికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించిన‌ మంత్రి

సిడ్నీ: ఆస్ట్రేలియా ర‌క్ష‌ణ మంత్రి లిండా రేనాల్డ్స్‌.. రేప్ బాధితురాల‌కి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించారు.  ర‌క్ష‌ణ కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న బ్రిట్నీ హిగ్గిన్స్ అనే మ‌హిళా ఉద్యోగి ఇటీవ‌ల రేప్ ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.  త‌మ ఆఫీసులోని మ‌రో ఆఫీస‌ర్ త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు హిగ్గిన్స్ ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ చేసింది. అయితే ఆ బాధితురాలు హిగ్గిన్స్‌పై ర‌క్ష‌ణ మంత్రి లిండా ఓ సంద‌ర్భంలో అనుచిత కామెంట్ చేశారు.  రేప్ బాధితురాలు అబద్దాలు చెప్పే జంతువన్న వ్యాఖ్య‌లు చేశారామె.  త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు మంత్రి లిండా పేర్కొన్నారు.  అయితే ఇదే కేసులో హిగ్గిన్స్‌కు  ర‌క్ష‌ణ మంత్రి లిండా న‌ష్ట ప‌రిహారం చెల్లించారు. ప్ర‌స్తుతం మంత్రి లిండా రేనాల్డ్స్ సిక్ లీవ్‌లో ఉన్నారు.  సోష‌ల్ మీడియాలో ఆమె త‌న క్ష‌మాప‌ణ పోస్టు చేశారు.  మంత్రి చెప్పిన క్ష‌మాప‌ణ‌ల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు హిగ్గిన్స్ పేర్కొన్న‌ది. కానీ అత్యాచార బాధితులు ఆశ్ర‌యం పొందే సంస్థ‌లో చేరేందుకు త‌న‌కు ఆర్థిక స‌హాయం కావాల‌ని కోరింది.  హిగ్గిన్స్ కోరిన‌ట్లే మంత్రి ఆమెకు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించారు. 

Advertisement
రేప్‌ బాధితురాలికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించిన‌ మంత్రి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement