Layoffs | ఉద్యోగులను సాగనంపే పనిలో పెప్సికో..!
Layoff in Pepsi Co | ప్రస్తుతం దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌తో మొదలైన ఈ ట్రెండ్ మిగతా కంపెనీలకు పాకుతున్నది. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నత తర్వాత లే ఆఫ్స్ పేరుతో
Layoffs in Pepsi Co | ప్రస్తుతం దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌తో మొదలైన ఈ ట్రెండ్ మిగతా కంపెనీలకు పాకుతున్నది. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నత తర్వాత లే ఆఫ్స్ పేరుతో ఎలాన్ మస్క్ ఉద్యోగులను సాగనంపారు. ప్రస్తుతం అమెజాన్, ఫేస్‌బుక్‌తో పాటు పలు కంపెనీలు లే ఆఫ్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో పెప్సికో కంపెనీ చేరింది. కంపెనీ సైతం ఉద్యోగులను తొలగించే ప్రయత్నాల్లో ఉన్నది. వాల్ స్ట్రీట్ జనర్నల్ ప్రకారం.. పెప్సికో ఇంక్ న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలోని స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్ల నుంచి వంద మందికిపైగా ఉద్యోగులను తొలగించే యోచిస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఉద్యోగులకు పంపిన మెమోలో..
ఉద్యోగులకు పంపిన మెమోలో సంస్థను సరళీకృతం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పని చేయవచ్చని కంపెనీ తెలిపినట్లు వాల్‌స్ట్రీట్ జనరల్ తెలిపింది. స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాలతో పాటు స్నాక్స్ యూనిట్ ఇప్పటికే తొలగింపులు చేపట్టారని, దీంతోపాటు బేవరేజెస్ బిజినెస్‌లో భారీగా కోతలుంటాయని పలువురు పేర్కొంటున్నారు. అనిశ్చితి వాతావరణం, ద్రవ్యోల్బణం నిలకడలేమితో పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ ఇంక్‌తో పాటు సీఎన్ఎస్ తదితర మీడియా దిగ్గజాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం అమెజాన్, ఆపిల్, మెటా ప్లాట్‌ఫామ్ ఇంక్ తదితర బడా టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించుకుంటూ వెళ్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

