Raj Tarun – Lavanya | టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారంటూ అతడి మాజీ ప్రేయసి లావణ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై హైదరాబాద్లోని నార్సింగి పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చింది. అయితే తాజాగా పోలీసులు కూడా తనకు న్యాయం చేయడం లేదంటూ పోలీస్స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసింది లావణ్య.
పోలీస్ స్టేషన్ ముందే నా ప్రాణాలు వదిలేస్తాను. నా ఇంటి మీద దాడిచేయడానికి మళ్లీ నలుగురు ఆడవాళ్లు వచ్చారు. ప్రతిసారి 100కి కాల్ చేసి సహయం అడగాల్సి వస్తుంది. రాజ్ తరుణ్, శేఖర్ బాషా కలిసి నాపై కావాలని దాడి చేస్తున్నారు. మా కేసు కోర్టులో నడుస్తున్న కూడా మళ్లీ ఎందుకు దాడి చేస్తున్నారు. ఒక్కొక్క క్షణం ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. నార్సింగ్ పోలీసు స్టేషన్లో నేను కంప్లయింట్ ఇచ్చాను కానీ వారు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఇంకెప్పుడు ఈ విషయంపై స్పందిస్తారు. పోలీసులకు ఒక్కటే చెబుతున్నాను. నేను పెట్టిన కేసుపై స్పందించకుంటే కమీషనర్ని వెళ్లి కలుస్తాను. వాళ్లు ఎవరో నన్ను చంపే బదులు నేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రాణాలు వదిలేస్తానంటూ లావణ్య చెప్పుకోచ్చింది.