భారీగా క్రాస్ ఓటింగ్.. ఏ రాష్ట్రంలో ఎలా జరిగింది?
న్యూఢిల్లీ: 15వ రాష్ట్రపతిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో ఆమెకు ఓట్లు పోలయ్యాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మద్దతుగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేసినట్లు తెలుస్తోంది. కేరళ నుంచి అనూహ్య రీతిలో ముర్ముకు అనుకూలంగా ఒక ఓటు పోలైంది. 140 సభ్యులు ఉన్న కేరళ అసెంబ్లీలో ఎన్డీఏకు ఒక్క సీటు కూడా లేదు. కానీ ముర్ముకు ఆ రాష్ట్రం నుంచి ఓటు పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఎన్నికల్లో ముర్ముకు 64 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇక అస్సాంలో 25 మంది విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటేశారు. అస్సాం అసెంబ్లీలో 126 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో ఎన్డీఏకు 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆ రాష్ట్రం నుంచి ముర్ముకు అనుకూలంగా 104 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హిమంత శర్మ విపక్ష ఎమ్మెల్యేలకు థ్యాంక్స్ కూడా చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో ముర్ముకు 16 అదనపు ఓట్లు పోలయ్యాయి. ఆ రాష్ట్రంలో ఆమెకు మొత్తం 146 ఓట్లు పడ్డాయి. బీజేపీ ఉన్న సీట్ల కన్నా ఎక్కువ సంఖ్యలో ఆ పార్టీకి ఓట్లు పోలైనట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బెంగాల్లో బీజేపీకి 69 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ముర్ముకు అనుకూలంగా 71 ఓట్లు పడ్డాయి. జార్ఖండ్‌లో 81 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 9 మంది మాత్రమే యశ్వంత్‌కు సపోర్ట్ ఇచ్చారు. మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్‌కు విశ్వాస పరీక్ష సమయంలో 164 ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ ఆ రాష్ట్రం నుంచి ముర్ముకు అనుకూలంగా 181 ఓట్లు పోలవ్వడం విశేషం.
మేఘాలయాలో ఉన్న టీఎంసీ ఎమ్మెల్యేలు కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. మణిపూర్‌లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటేశారు. బీహార్, చత్తీస్‌ఘడ్‌లోని ఆరేసి మంది విపక్ష ఎమ్మెల్యేలు, గోవా నుంచి నలుగురు విపక్ష ఎమ్మెల్యేలు, గుజరాత్ నుంచి పది మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో యశ్వంత్ సిన్హాకు ఒక్క ఓటు కూడా పోలవ్వలేదు. 10 గంటల పాటు జరిగిన ఓటింగ్ తర్వాత ముర్ముకు 2824 మంది, యశ్వంత్‌కు 1877 మంది ఓటేసినట్లు తేలింది. ముర్ము ఓట్ల విలువ 6,76,803 కాగా, యశ్వంత్‌కు ఓట్ల విలువ 3,80,177గా ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

