బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా పాట పెడితేనే పాలు తాగుతున్న కొండెంగ..!! ఎక్కడంటే?
సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదోగానీ ఈ కొండెంగ మాత్రం మైమరచిపోతున్నది.. ఇటీవల ట్రెండ్ అయిన బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా పాట వింటేనే ఆ బుల్లి కొండెంగ పాలుతాగుతున్నది..పాట పెట్టకుంటే మారాం చేస్తున్నది. ఇదెక్కడి వింత అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు..
మహబూబాబాద్ మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో కోతుల బెడదనుంచి తప్పించుకునేందుకు ఓ కొండెంగను తీసుకొచ్చారు. దానికి ఇటీవల బుల్లి కొండెంగ పుట్టింది. అయితే, తల్లి చనిపోయింది. అప్పటినుంచి ఆ బుల్లి కొండెంగ పాలు తాగకుండా మారాం చేస్తున్నది. ఊరివాళ్లు ఎంత ప్రయత్నించినా పాలు తాగడం లేదు. దీంతో ఊరోళ్లంతా కలిసి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఆ బుల్లి కొండెంగకు సోషల్‌మీడియాలో ట్రెండ్ అయిన బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా అనే పాటను సెల్ఫోన్లో చూపించారు. ఇక అంతే ఆ బుల్లి కొండెంగ మైమరిచిపోయింది. పాలు చకచకా తాగేస్తోంది. పాట వస్తున్నంతసేపు సెల్ఫోన్లో తలపెట్టి చెప్పినట్లు వింటోంది.. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Stone gallery | రాళ్లతో అద్భుతమైన డిజైన్స్
తీరొక్క మొక్క..పచ్చని పూదోట.. ప్రకృతివనాన్ని తలపిస్తున్న పీపుల్స్ ప్లాజా
సాఫ్ట్వేర్ జాబ్ వదిలి బేబీ ఫొటోగ్రఫీ.. కెమెరాతో అద్భుతాలు సృష్టిస్తున్న యువతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

