Kedarnath Yatra | కేదార్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. పలువురు గల్లంతు
Kedarnath Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ (Rudraparayag) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర (Kedarnath Yatra) మార్గంలో గౌరీకుండ్ (Gaurikund) వద్ద కొండ చరియలు (Landslide) విరిగిపడ్డాయి.
Kedarnath Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ (Rudraparayag) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర (Kedarnath Yatra) మార్గంలో గౌరీకుండ్ (Gaurikund) వద్ద కొండ చరియలు (Landslide) విరిగిపడ్డాయి. బండరాళ్లు దూసుకెళ్లడంతో అక్కడ కొన్ని షాపులు నేలమట్టమయ్యాయి. దుకాణ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. మరికొంత మంది గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు.
ఘటనతో జాతీయ విపత్తు దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యలు ప్రారంభించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఓవైపు భారీ వర్షం, మరోవైపు కొండలపై నుంచి జారి పడుతున్న బండరాళ్ల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కొందరు పర్యాటకులు తప్పిపోయినట్లు వెల్లడించారు.
గల్లంతైన వారు వినోద్ (26), ములాయం (25), అషు (23), ప్రియాంషు చమోలా (18), రణబీర్ సింగ్ (28), అమర్ బోహ్రా, అనితా బోహ్రా, రాధిక బోహ్రా, పింకీ బోహ్రా, పృథ్వీ బోహ్రా (7), జటిల్ (6), వకీల్ (3)గా గుర్తించినట్లు తెలిపారు. గత రాత్రి నుంచి గౌరీకుండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం ఈ ప్రమాదానికి దారితీసింది. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ డాక్టర్ విశాఖ తెలిపారు.
ఉత్తరాఖండ్ కు వాతావరణ శాఖ హెచ్చరికలు..
మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు పౌరీ, టెహ్రీ, రుద్రప్రయాగ్ , డెహ్రాడూన్ లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చమోలి, నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read..
IndiGo | పాట్నా-ఢిల్లీ విమానంలో ఇంజిన్ ఫెయిల్.. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్
Viral Video | దొంగను చావబాదిన సిక్కు ఎన్నారై.. వీడియో వైరల్
Gyanvapi Mosque | గట్టి భద్రత మధ్య జ్ఞానవాపిలో ప్రారంభమైన సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ సభ్యులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

