లక్ష మెరుపులు మీదకి దూకినాయా
‘వందో, ఒక వెయ్యే, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ…ముందో అటు పక్కో, ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయ’..అంటూ రొమాంటిక్ పాట పాడుకుంటున్నారు స్టార్ హీరో మహేష్ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి వాలెంటైన్స్ డే సందర్భంగా ‘కళావతి..’ పాటను విడుదల చేశారు. కీర్తి సురేష్, మహేష్ బాబు జోడీ మీద చిత్రీకరించిన ఈ పాట కథానాయకుడి ప్రేమ మైకాన్ని వ్యక్తీకరిస్తుంది. థమన్ స్వరకల్పనలో సిధ్ శ్రీరామ్ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. కళావతి.. ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి విడుదల చేసిన తొలిపాట . లిరికల్ వీడియోలో సంగీత దర్శకుడు థమన్, గాయకుడు సిధ్ శ్రీరామ్ ఇతర గాయనీగాయకులు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. బ్యాంకింగ్ రంగ నేపథ్యంతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఫ్లస్ పతాకాలపై నవీన్ యేర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని మే 12న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

